Telangana Cine Musicians Association: "కీరవాణి వద్దు, ఆ పాటకు ఆయన సంగీతం ఏంటి.. అది చారిత్రక తప్పిందం"

తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. ముఖ్యంగా ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి వద్దంటూ లేఖలో ప్రధానంగా చర్చించారు. అసలు కీవరాణి ఎందుకు, దేనికి వద్దంటూ తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ లేఖను విడుదల చేసిందో మనం ఇప్పుడు తెలుసుకుంది. అలాగే సీఎం కేసీఆర్ కు ఏం వివరించారో కూడా చూద్దాం.

అందెశ్రీ రచించిన 'జయజయహే తెలంగాణ...' గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రటించారు. దీన్ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయబోతున్నారు. అయితే దీనిపై తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ సంస్థ స్పందించింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. అందులో.. జయజయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా విడుదల చేయబోతున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలతో పాటు తెలంగాణ కళాకారులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని వివరరించారు.

Telangana Cine Musicians Association Write A letter to CM Revanth Reddy About Keeravani Check Details

అలాగే తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ (TCMA) కూడా గర్వపడుతున్న గొప్ప సందర్భం ఇదంటూ పేర్కొన్నారు. పదేళ్ల క్రితమే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రజలకు అందిస్తే ఎంతో బాగుండేదని లేఖలో పేర్కొన్నారు. అలా జరగకపోవడం దురదృష్టకరం అని గత ప్రభుత్వం ఈ పాట విషయంలో ఎన్నో తప్పులు చేసిందన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఈ పాట ప్రజలకు ఎంతో చేరువైయ్యిందని చెప్పుకొచ్చారు. అలాంటి పాటని గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పాట కొందరు తెలంగాణ రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో నలిగి నలిగి చచ్చిపోయిందిని.. మళ్ళీ మీ వల్ల పుట్టి పురుడు పోసుకుంటున్న శుభ తరుణమిది అంటూ లేఖలో వ్యాఖ్యానించారు. ఈ పాటని బతికిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు కూడా తెలిపారు. అన్నీ బాగానే ఉన్నా ఇంతటి గొప్ప పాటని సంగీత దర్శకులు కీరవాణిని.. సంగీతాన్ని అందించమని కోరటం చారిత్రక తప్పిదం అవుతుందని మీకు తెలియజేస్తున్నామంటూ వెల్లడించారు. తెలంగాణ అస్తిత్వం మీకు తెలియనిది కాదని.. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందో కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదంటూ వివరించారు.

Telangana Cine Musicians Association Write A letter to CM Revanth Reddy About Keeravani Check Details

మన ఉద్యోగాలు మనకే రావాలి, మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని.. సకల జనుల సహకారంతో ఎంతో మంది అమర వీరుల త్యాగ ఫలంగా ఏర్పడింది మన తెలంగాణ రాష్ట్రం అని లేఖలో వివరించారు. ఇంతటి ఖ్యాతి గడించిన మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు పాడటమేంటి, అలాగే పక్క రాష్ట్రాల వాళ్ళు ఆ పాటకి సంగీతాన్ని అందించడమేంటిని ప్రశ్నించారు. అలా చేయడం అంటే మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుందని.. ఇది మీరు గ్రహిస్తారని తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ (TCMA) కళాకారులుగా కోరుతున్నామని చెప్పుకొచ్చారు.

ఎంతో ప్రతిభావంతులు మన తెలంగాణాలో ఉన్నారని.. మన తెలంగాణ కళాకారులకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి తెలంగాణ కళాకారులకి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నామని వివరించారు. అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని వివాదాలకు దూరంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ పిల్లలతో ఒక బృంద గానంగా పాడించి విడుదల చేస్తే... 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' అనే గీతంలా గౌరవింపబడుతుందనేది మా అభిప్రాయం అంటూ వివరించారు. ఇది మా సలహా మాత్రమేనని.. ఈ చారిత్రక గీతాన్ని ఒక చారిత్రక తప్పిదంగా చేయకూడదని మిమ్మల్ని కోరుకుంటానమ్మంటూ స్పష్టం చేశారు. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారా, ఎలా స్పందిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X