సినిమా మస్తుగున్నది.. ఫిదా అయిన కేసీఆర్.. చిత్ర యూనిట్‌పై ప్రశంసలు
వరుణ్ తేజ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫిదా.
వరుణ్ తేజ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫిదా. జూలై 21న
ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలి ఆట నుంచే ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ టాక్‌తో దూసుకెళ్తున్నది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. అమెరికాలో కూడా ఈ చిత్రం విజయఢంకా మోగిస్తున్నది. ఈ చిత్రాన్ని ఇటీవల చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చిత్ర యూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.

ఫిదాను చూసిన సీఎం కేసీఆర్
ఫ్యామిలీ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకర్షిస్తున్న ఫిదా చిత్రాన్ని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రత్యేకంగా చూశారు. సినిమా చక్కగా ఉంది. దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత దిల్‌రాజు అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరక్కించారు. నటీనటులు చక్కగా నటించారు అని సీఎం కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. వీలు చూసుకొని చిత్ర యూనిట్ తనను కలువాలని సీఎం ఆహ్వానించడం గమనార్హం.

తెలంగాణ అమ్మాయి, ఎన్నారై అబ్బాయి
స్వతంత్ర భావాలు ఉన్న తెలంగాణ అమ్మాయి, ఎన్నారై యువకుడికి మధ్య జరిగిన అందమైన ప్రేమకథగా ఫిదా చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో కుటుంబపరమైన భావోద్వేగాలు చక్కగా పండాయి. అక్కాచెల్లెలు, తండ్రి కూతుళ్లు, అత్తా కోడళ్ల మధ్య బంధాలు, అనుబంధాలను చక్కగా చూపించారు. కుటుంబంలో ఉండే ప్రేమానురాగాలను అద్భుతంగా చిత్రీకరించారు.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ..
ఫిదా చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విడుదలైన ప్రతీ చోట కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. అమెరికాలో ఇప్పటికే మిలియన్ డాలర్స్ క్లబ్‌లో చేరింది. విడుదలైన రెండు రోజుల్లోపే మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం ఈ సినిమాకు వస్తున్న ఆదరణను చెప్పకనే చెప్పింది.

తెలంగాణ యువతిగా భయపడ్డాను..
ఫిదా చిత్రంలో తెలంగాణ యువతిగా నటించిన సాయి పల్లవి చక్కటి అభినయంతో ఆకట్టుకొన్నది. తెలంగాణ యువతి పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తారా అనే భయం తనను వెంటాడేదని ఇటీవల సక్సెస్ మీట్‌లో సాయి పల్లవి పేర్కొన్నారు. ఎన్నారై యువకుడిగా మెగా హీరో వరుణ్ నటించారు. ఈ చిత్రానికి పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా మారాయి.


Click it and Unblock the Notifications











