రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
లోక్‌సభ ఎన్నికల సమయంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కడమే కాకుండా సినిమా రంగాన్ని చుట్టేస్తూ వివాదంగా మారుతున్నాయి. గత కొద్దికాలంగా టెలిఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు బురద జల్లుకొంటున్నారు. ఈ క్రమంలో తనకు పరువు నష్టం దావా కేసులో లీగల్ నోటీసులు పంపండంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆ వివాదం వివరాల్లోకి వెళితే..
గత ప్రభుత్వంలో సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల టెలిఫోన్ కాల్స్‌ను ట్యాప్ చేశారనే విషయం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో కొందరు పోలీస్ ఆఫీసర్లను, ఇతర అధికారులును ప్రభుత్వం అరెస్ట్ చేసి విచారిస్తున్నది. ఈ నేపథ్యంలో కొందరి పేర్లు బయటకు రావడం మరింత సంచలనం రేపింది.

అయితే అప్పటి మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలోనే వందల మంది టెలిఫోన్ కాల్స్ ట్యాపింగ్ జరిగాయి. కాబట్టి వారందరిని విచారించి చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని సీఎం రేవంత్ రెడ్డి, ఇతర అధికారులు స్పష్టం చేశారు. అయితే తనపై అవాస్తవాలతో తన ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా అసత్యాలను ప్రచారం చేస్తున్నారనే విషయంపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.
పరువు నష్టం దావా నమోదు చేసి పంపించిన లీగల్ నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పరువు ఉన్న వాడు వేస్తే పరువు నష్టం దావా. ఏమీ లేని వాడు వేస్తే అది ఏమౌతుంది. ఆయన పరువు ఉందని నిరూపించుకోవాలి. 34 లక్షల మంది విద్యార్థుల పరువును కోట్ల రూపాయలకు నడిరోడ్డున అమ్మింది. తెలంగాణ పరువును, ఆత్మ గౌరవం తీసిన నీచుడు ఎవరైనా ఉన్నారంటే నీచుడు కేటీఆర్. అలాంటి వ్యక్తి నాకు నోటీసుల ఇవ్వడమేంటి? అని సీఎం అన్నారు.

సిట్, ఈడీ, సీబీఐ అధికారుల దర్యాప్తుపై నమ్మకం లేకపోతే సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయండి.. ఆ విచారణ తర్వాత మీకు పరువు ఉందని తేలితే.. అప్పుడు పరువు నష్టం గురించి ఆలోచిద్దాం. ఇదేమైనా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు సంతకం చేసినట్టా? లేదా సమంత సిరీస్‌కు సంతకం చేసినట్టా? పరువుపై ధరను నిర్ణయించడం ఎలా కుదురుతుందని ఎద్దేవా చేశాడు.


Click it and Unblock the Notifications











