twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్లో ఆంధ్ర, తెలంగాణ వివాదం..ఓయూ మద్దతు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సినీ పరిశ్రమను కూడా విడగొట్టాలంటూ గత కొంత కాలంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ నిర్మాతల మండలి వేరు కుంపటి కోసం ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా మరో వివాదం కూడా తెరపైకి వచ్చింది.

    సినిమాల్లో తమకు అవకాశాలు సరిగా ఇవ్వడం లేదంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన డాన్సర్స్ అసోసియేషన్ సభ్యులు.....ఆందోళనకు దిగారు. వీరికి ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు కూడా మద్దతుగా రావడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్‌లో నిర్మాతల మండలి సమావేశం జరుగుతుండగా సమావేశంలోకి డాన్సర్స్, విద్యార్థులు చొచ్చుకెల్లారు.

    Telangana Dancers association protest at Film Chamber

    తెలంగాణ డాన్సర్స్ పట్ల నిర్మాతలు, దర్శకులు వివక్ష చూపుతున్నారని, తమకు అవకాశాలు ఇవ్వడం లేదని ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలంటూ వాగ్వివాదానికి దిగారు. నిర్మాతలు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని నిర్మాతలు సి కళ్యాణ్, సురేష్ బాబు, బివివిఎస్ఎన్ ప్రసాద్ తదితరులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

    తెలుగు ఫిలిం చాంబర్‌ను విభజించాలని డిమాండ్‌ చేస్తూ.. ఓయూ ఫిల్మ్ కోర్సుల విద్యార్థులు ఫిలిం చాంబర్‌ వద్ద ఆందోళనకు దిగారు. విద్యార్థులు ఫిలిం చాంబర్‌లోకి దూసుకెళ్లి సమావేశంలో పాల్గొన్న నిర్మాతలతో వాగ్వాదానికి దిగారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు సారథి స్టూడియో నుంచి ఫిలించాంబర్‌ వరకు విద్యార్థులు బైక్‌ ర్యాలీ తీశారు.

    English summary
    Telangana Dancers association protest at Film Chamber.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X