ఏం తెర మీదే హీరోలా? సూటి ప్రశ్న
సినిమాల్లో అయితే హీరోలు అన్యాయాన్ని ఎదిరించి పోరాడతారు. మరి ఇన్నేళ్ళ నుంచీ తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని వారు ఎందుకు గమనించటం లేదని దర్శకుల సంఘం అధ్యక్ష్యుడు ఎన్.శంకర్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం అరవై ఏళ్ళుగా సాగుతోంది. దీనిని హీరోలంతా సమర్ధించాలని డిమాండ్ చేసారు. సినిమాను పెంచి పోషించింది నైజాం వారే నని ఆయన చెప్పారు. అలాగే పరిశ్రమలో ఉన్న తెలంగాణా వారెవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. అందరికీ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. పరిశ్రమలో ఉన్న తెలంగాణ వారంతో కలిసి తమ వారికి అవకాశాలు ఇచ్చి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఆయన తెలంగాణా నటులను తయారు చేస్తానన్న సంగతి తెలిసిందే.
తెలంగాణ నితిన్ శంకర్ శ్రీ రాములయ్య యమజాతకుడు జయం మనదేరా వెంకటేష్ telangana nitin shankar sri ramulayya yamajatakudu jayam manadera


Click it and Unblock the Notifications