twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇది సినీ జనుల 'దూకుడు'

    By Srikanya
    |

    నిరవధిక ఆందోళన కార్యక్రమాలకు తెలంగాణవాదులు పిలుపు ఇచ్చినప్పటికీ హైదరాబాద్‌లో మహేష్‌ బాబు అభిమానులు, సినీ జనాలకు 'దూకుడు' ఫీవర్ తో ఊగిపోతున్నారు. శుక్ర, శని, ఆదివారాలులలో దూకుడు ధియోటర్స్ వద్ద భీభత్సమైన జనం ఉంటున్నారు. ఎక్కడైనా అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభించిన అర్ధ గంటలోనే టికెట్లన్నీ అమ్ముడుపోతున్నాయి. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హైదరాబాద్‌లో 69 సినిమా థియేటర్లు, ఉత్తరాంధ్రలో 54 సినిమా థియేటర్లలో విడుదలైనా జనం తగ్గలేదు. అంతేకాక తెలుగు సినీ చరిత్రలో రికార్టు సృష్టిస్తున్నట్టుగా అమెరికాలో 79 థియేటర్లలో 'దూకుడు' విడుదలై అక్కడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే చెన్నయ్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం 17 థియేటర్లలో విడుదలైంది ఎన్నడూ లేని విధంగా. అన్ని సెంటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సినీ నిర్మాతల నుంచి అందిన సమాచారం దూకుడు సినిమా తొలి రోజు దాదాపు రూ. 9 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఒక్క నైజాంలోనే రూ. 2 కోట్లు వసూలు చేసిందని డిస్టిబ్యూటరీ వర్గాలు అంటున్నాయి. మరి కొన్ని రోజుల్లో దూకుడు ఇంతకు ముందు వచ్చిన సినిమాల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అని అంటున్నారు అభిమానులు.

    మహేష్ బాబు, సమంత జంటగా నటిస్తున్న దూకుడు చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్నాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రల్లో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూ సూద్, షాయాజీ షిండే, నాజర్, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, బ్రహ్మాజీ, చంద్రమోహన్, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తుండగా...థమన్, కె.వి. గుమన్, గోపీ మోహన్, కోన వెంకట్, కోటి పరుచూరి, ఎ.ఎస్. ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, రామజోగయ్య శాస్త్రీ, భాస్కరభట్ల, విశ్వ సాంకేతిక నిపుణులు.

    English summary
    Mahesh Babu- Dookudu.. In Ap the film collected around Rs5.1 Cs rupess on first day of its release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X