జెనీలీయా రొమాంటిక్ ధ్రిల్లర్ కథ కూడా కష్టమే..
జెనిలియా ప్రధాన పాత్రలో గుణ్ణం గంగరాజు నిర్మించిన కథ చిత్రం రిలీజ్ కూడా వాయిదా పడేటట్లు ఉందని సమాచారం. వేగంగా మారుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్దితుల్లో తమ సినిమా రిలీజ్ చేయటం ఎంతవరకూ కరెక్టుని పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ శుక్రవారం విడుదల కావాల్సిన విష్ణు 'సలీమ్' చిత్రం ఇప్పటికే వాయిదా పడింది. కొత్త తేదీని తర్వాత ప్రకటించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం 'కథ' చిత్రం కూడా 12న విడుదల కావడం అనుమానమేనని వినపడుతోంది.
ఇటీవల వరుసగా రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణా బంద్ ప్రభావంతో 3 కోట్ల వరకూ ఎగ్జిబిటర్లు నష్టపోయారు. దాంతో ఇప్పుటికే విడుదల తేదీలు ప్రకటించుకుని ప్రచారానికి కూడా వెళ్లిన పలు చిత్రాలు రిలీజ్ తేదీలు మార్చుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రిస్క్ చేసేందుకు ఇష్టంలేకనే పలువురు నిర్మాతలు ఈ నిర్ణయానికి వస్తున్నారు.
'ఐతే', 'అనుకోకుండా ఒకరోజు' వంటి హిట్ చిత్రాలను అందించిన జస్ట్ ఎల్లో సినిమా పతాకంపై రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా 'కథ' చిత్రాన్ని నిర్మించారు. జెనీలియా, కొత్త నటుడు అరుణ్ జంటగా శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. తొలుత ఈ చిత్రాన్ని ఈనెల 11న రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ చివరకు 12వ తేదీని ఖరారు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ తేదీ కూడా మారే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర నిర్మాతలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











