Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
వందల కోట్ల దందా? మనకు తెలిసిన డ్రగ్స్ పాపం కొంతే: టాలీవుడ్ తూలుతోంది
టాలీవుడ్ ఇప్పుడు పైకి కనిపించని ఆందోళన లో ఉంది ఎప్పుడూ వివాదాస్పద అంశాలతో ఉంటూనే ఉంటుంది ఏ సినీ పరిశ్రమ అయినా అయితే టాలీవుడ్ కొంత వేరు... బాలీవుడ్ మాదిరి మాఫియాలు గానీ తమిళ, మళయాల ఇండస్ట్రీలల్లో ఉండే రౌడీఇజం గానీ ఇక్కడ కనిపించేవి కాదు.

పబ్, రెస్టారెంట్, రియల్ ఎస్టేట్
నటన లో తప్ప వేరే వ్యాపారాల్లోకి కూడా దిగకుండా ఉన్నారు ఓ పదేళ్ళ కిందటి వరకూ, మనవాళ్ళు క్లీన్ ఇమేజ్ తోనే ఉండేవాళ్ళూ ఉన్నారు కూడా అయితే గత అయిదేళ్ళ లో పరిస్థితులు మారిపోయాయి. హీరోలూ, నటులూ వేరే బిజినెస్ లు మొదలు పెట్టటం దాన్లో పబ్, రెస్టారెంట్, రియల్ ఎస్టేట్ లాంటి ఇల్లీగల్ వ్యవహారాలు జరిగే "దందా" లు ఉండటం మామూలైపోయింది...

కబ్జాలూ, సెటిల్మెంట్లు
ఇక ఏకంగా కబ్జాలూ, సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్న నిర్మాతలూ ఉన్నారు, బడా రాజకీయ నేతల బినామీ అని మార్క్ పడ్డ వాళ్ళూ వచ్చేసారు అయితే ఇవన్నీ ఒక ఎత్తూ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన చీకటి దందా ఒక ఎత్తూ అయ్యింది. ప్రపంచం మొత్తం లో పేద డేశాల ఆర్థిక, శ్రామిక వ్యవస్థలనే దెబ్బ తీసిన డ్రగ్స్ ఒక అలవాటుగానే కాదు కోట్ల రూపాయలు సంపాదించే ఆదాయమార్గంగా మారటం మరో షాకింగ్ న్యూస్...
Recommended Video


డ్రగ్స్ దందా ద్వారానే 100 కోట్లకు పైగా
ఇక్కడ మనం నమ్మలేని విషయం ఏమిటంటే సినిమాలకు దూరమై, అవకాశాలు లేని నటుడొకరు కేవలం డ్రగ్స్ దందా ద్వారానే 100 కోట్లకు పైగా లావా దేవీలను నడిపాడనీ, అయితే ఆ డబ్బు ని సద్వినియోగం చేయలేకా, ఆ డీలింగ్స్ లో ఉన్న గొడవలవల్లే కుటుంబానికి కూడా దూరమై చివరికి మరణించాడనీ ఒక రూమర్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ సమాచారం మాత్రం క్లారిటీగా బయటకి పొక్కటం లేదు...

చెల్లింపులు ఏ విధంగాః
అందుకే డ్రగ్స్ సరఫరాకు సంబంధించి చెల్లింపులు ఏ విధంగా సాగేవి అన్న విషయం మీద అధికారులు దృష్టి పెట్టారు. టాలీవుడ్ ప్రముఖులు పలువురుఆన్ లైన్ ద్వారానే చెల్లింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. అదే నిజమైన పక్షంలో.. చెల్లింపుల వివరాల్ని ఆధారాలుగా చూపించొచ్చని చెబుతున్నారు.

డ్రగ్స్ సప్లయర్ కెల్విన్
చెల్లింపుల కోసం తాను ఎప్పుడూ కలవలేదని.. అదంతా ఆన్ లైన్లో జరిగిపోతుందని చెబుతున్నారు. దీంతో.. కెల్విన్ బ్యాంకు ఖాతాల్ని చెక్ చేయటంద్వారా.. అతగాడి కస్టమర్లు ఎవరన్నది గుర్తించే వీలుందని చెబుతున్నారు. డ్రగ్స్ సప్లయర్ కెల్విన్ ఇచ్చిన సమచారాన్ని అన్నికోణాల్లో క్రాస్ చెక్ చేసుకున్నాకే మరో ఆరుగురితో కూడిన రెండో లిస్ట్ తయారు చేశారని, అది కానీ బయటకు వస్తే అదో పెను సంచలనంగా మారటం ఖాయమని తెలుస్తోంది.

ప్రముఖ నిర్మాత
అసలు ఇప్పటి వరకూ ఊహించని వారి పేర్లున్నాయనీ ఈ జాబితాలో ప్రముఖ నిర్మాత మరి ముఖ్యంగా ఆరుగురు పేర్లలో ఇద్దరు ప్రముఖ నిర్మాతల వారసులు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇదే విషయాన్ని పూరీ చెప్పిన పేర్లు అంటూ ఎవరో నెట్ లో ప్రచారం చేసే సరికి "నేను ఎవరి పేర్లూ చెప్పలేదు" అంటూ పూరీ మళ్ళీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

రెండో జాబితా
తాజాగా రెండో జాబితాను సిట్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విచారణలో కెల్విన్ చెప్పిన వివరాలతో సెకండ్ లిస్ట్ తయారు కానున్నట్లుగా చెబుతున్నారు. ఈ లిస్ట్ లో పలువురు రాజకీయ నేతల పిల్లలు.. హైప్రొఫైల్ పెద్దలకు సంబంధించిన వారితో పాటు ప్రముఖులు.. పేజ్ త్రీ సెలబ్రిటీల పేర్లు ఉన్నాయని తెలుస్తోంది.

ప్రముఖ సంగీత దర్శకుడు
వీరితో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు.. అతని సోదరుడు.. మరో ఫైట్ మాస్టర్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఇండస్ట్రీకి కీలకమైన వ్యక్తులే నోటీసులు ఇవ్వాల్సిన జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. ఇదంతా ప్రచారంగానే మిగిలిపోతుందా? నిజంగానే అధికారులు వారికీ నోటీసులు ఇవ్వనున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.