రంగంలోకి ఫిలిం ఛాంబర్.. తెలంగాణలో టికెట్ రేట్ల తగ్గింపు.. వాళ్లకు రీఫండ్ కూడా??

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జి.ఓ 120 దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి వెంటనే రంగంలోకి దిగింది. G.O పెద్ద సినిమాల కోసం విడుదల చేయగా కొన్ని మల్టీప్లెక్స్‌లు అత్యుత్సాహంతో గరిష్ట ధరలను ఎంచుకోవడం ద్వారా మొదటికే మోసం వచ్చే అవకాశం ఉండటంతో వారితో చర్చలు జరిపింది. ఆ వివరాల్లోకి వెళితే..

జీవో 120

జీవో 120

సినిమా థియేట‌ర్స్‌లో టికెట్ రేట్ పెంచుకోవ‌చ్చని ఇటీవ‌ల తెలంగాణ ప్రభుత్వం జీవో 120 జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో మ‌ల్టీప్లెక్స్‌ల‌లో శుక్ర‌వారం విడుద‌లైన సినిమాల‌కు టికెట్ ధ‌ర‌ను రూ320కు పైగా విక్ర‌యించారు. అర్జున ఫాల్గుణ వంటి చిన్న సినిమా సహా ప్రస్తుతం ఇతర రన్నింగ్ చిత్రాలకు ఈ అత్యధిక రేటు స్లాబ్ అమలు చేయబడింది. ఫలితంగా ఆక్యుపెన్సీ బాగా పడిపోయింది.

ధరలు తగ్గేలా

ధరలు తగ్గేలా

ఇది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. దీని మీద తెలంగాణ ఫిల్మ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ స్పందించింది. ఛాంబర్ మల్టీప్లెక్స్‌లతో మాట్లాడి రేపటి నుంచి ధరలు తగ్గేలా చూసింది. తాజాగా ప్ర‌ముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూట‌ర్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్‌ సునీల్ నారంగ్ శుక్రవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

అధిక ధర‌ల‌కు టికెట్లు

అధిక ధర‌ల‌కు టికెట్లు

ఆయన మాట్లాడుతూ.. మా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ త‌రపున తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌గారికి, కేటీఆర్‌గారికి, సినిమాటోగ్ర‌ఫి మంత్రులు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ గారికి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''చిన్న సినిమాలు 50 -150 రూపాయ‌ల వ‌ర‌కూ టికెట్ అమ్ముకోవ‌చ్చు. దానిని మించి అధిక ధర‌ల‌కు టికెట్లు విక్ర‌యించ‌కూడ‌దన్నారు.

అవగాహ‌న వ‌స్తుంద‌ని

అవగాహ‌న వ‌స్తుంద‌ని

ఈ రోజు కొన్ని థియేట‌ర్స్‌లో టికెట్ రేట్లు ఎక్కువ రేటుకి అమ్మ‌డం మా దృష్టికి వ‌చ్చిందన్న ఆయన మేం వెంట‌నే స్పందించి ఆ రేట్ల‌ను స‌వ‌రించి మిగ‌తా డ‌బ్బుని వారి ఎకౌంట్స్‌కి రిఫండ్ చేయ‌డం జ‌రిగిందన్నారు. మాకు ప్రేక్ష‌కుల సౌక‌ర్యాలే ముఖ్యమన్న ఆయన ప్ర‌స్తుతం నిర్మాత‌ల‌కు మ‌రియు డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఈ విధానం గురించి అవ‌గాహ‌న క‌లిపిస్తున్నామని అన్నారు. మీడియా స‌హ‌కారంతో ఈ జీవోపై మ‌రింత మందికి అవగాహ‌న వ‌స్తుంద‌ని భావిస్తున్నామని అన్నారు.

Recommended Video

Yagna Movie Grand Launch Event Part 2 | Tollywood | Filmibeat Telugu
 ఎలా అమ్మాలంటే?

ఎలా అమ్మాలంటే?

ఫిలిం ఛాంబ‌ర్ సెక్ర‌ట‌రీ అనుప‌మ్ మాట్లాడుతూ.. ''గ‌వ‌ర్న‌మెంట్ ఇటీవ‌ల జీవో నెం 120ని విడుద‌ల‌ చేసిందని, ప్ర‌తి ఒక్క సినిమాకు లాభం జ‌ర‌గాలి అనేదే దాని సారాంశమని అన్నారు. అందులో మినిమం, మ్యాగ్జిమం రేట్ల‌ను నిర్ణ‌యించగా చిన్న సినిమాలు మినిమం రేట్ల‌కు, మీడియం సినిమాలు మొద‌టి వారం రోజులు మ్యాగ్జిమం రేట్ల‌కు అమ్మాలని అన్నారు. త‌ర్వాత మినిమం రేటుకు అమ్మాలి. పెద్ద సినిమాలు మొద‌టి రెండు వారాలు మ్యాగ్జిమం త‌ర్వాత మినిమం రేట్ల‌కు అమ్మాలి. ఈ రేట్లు అన్ని ప‌న్నుల‌తో స‌హా ఉంటాయని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X