ప్రొడ్యూసర్స్ గిల్డ్ కు షాక్.. షూటింగులు ఆపం.. ఆపితే చర్యలు తీసుకుంటామంటూ టీ ఫిలిం చాంబర్ ప్రకటన!

నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది, ఎలా అయినా దాన్ని తగ్గించుకోక పోతే ఇబ్బందులు పడతామని భావించిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగ‌స్ట్ 1 నుంచి షూటింగ్స్ నిలిపేయాల‌ని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ నిర్ణ‌యాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ న‌లుగురు త‌మ‌కు ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ మిగ‌తా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నార‌నీ టియ‌ఫ్‌సీసీ ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మండిప‌డ్డారు. ఆ వివరాల్లోకి వెళితే..

 ఇబ్బంది

ఇబ్బంది


ఫిలిం ఇండ‌స్ట్రీ ఎదుర్కొంటోన్న కొన్ని స‌మ‌స్య‌ల పై స్పందిచ‌డానికి తెలంగాణ ఫిలించాంబ‌ర్ త‌ర‌ఫున ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. టియ‌ఫ్‌సీసీలో ప్ర‌స్తుతం యాభై మంది నిర్మాత‌లు సినిమా షూటింగ్ లు నిర్వ‌హిస్తున్నారని, తన సినిమా షూటింగ్ కూడా జ‌రుగుతోందని ఆయన అన్నారు. ఇంకా రెండు రోజులే షూట్ బ్యాల‌న్స్ ఉందని, ఇలాంటి ప‌రిస్థితుల్లో షూటింగ్స్ ఆక‌స్మాత్తుగా ఆపేస్తే వ‌ర్క‌ర్స్ తో పాటు మిగ‌తా వారంద‌రికీ ఇబ్బంది క‌లుగుతుందని అన్నారు.

 టికెట్ రేట్లు పెంచుకున్నారని

టికెట్ రేట్లు పెంచుకున్నారని


ఆగ‌స్ట్ 1 నుండి షూటింగ్స్ నిలిపివేస్తున్నార‌ని ప‌త్రిక‌ల్లో, ఛాన‌ల్స్ లో వార్త‌లు చ‌దువుతున్నామన్న ఆయన అస‌లు షూటింగ్స్ ఎందుకు నిలిపివేస్తున్నారో తెలియ‌ని పరిస్థితి నెలకొంది. కొంద‌రు త‌మ స్వార్థం కోసం ముఖ్య‌మంత్రుల‌ను ఒక‌టికి నాలుగుసార్లు క‌లిసి టికెట్ రేట్లు పెంచుకున్నారని ఆయన అన్నారు. మ‌ళ్లీ థియేట‌ర్స్ కి ఆడియ‌న్స్ రావ‌డం లేద‌నీ షూటింగ్స్ నిలిపివేయాలంటున్నారని అన్నారు.

క‌రెక్ట్ కాదని

క‌రెక్ట్ కాదని


అస‌లు ఇది ఎంత వ‌ర‌కు క‌రెక్టో అర్థం కావ‌డం లేదని రామకృష్ణ గౌడ్ అన్నారు. సినిమా షూటింగ్స్ అయితే ఆపే స‌మ‌స్య లేదన్న ఆయన అంద‌ర్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి కానీ, మీకు మీరే టికెట్ రేట్లు పెంచాలని అన్నారు. షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణ‌యాలు తీసుకోవ‌డం క‌రెక్ట్ కాదని అన్నారు. ఇప్ప‌టికే క‌రోనా వ‌ల్ల ఎంతో మంది వ‌ర్క‌ర్స్ షూటింగ్స్ లేక ఎన్నో ఇబ్బందులు ప‌డ్డారని, క‌రోనా స‌మ‌యంలో మా చాంబ‌ర్ త‌ర‌పున 20 వేల మంది కార్మికుల‌కు సాయం చేశామని అన్నారు.

 ఒక్క‌రూ లేరని

ఒక్క‌రూ లేరని


ఆ ప‌రిస్థితుల నుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే షూటింగ్స్ జ‌రుపుకుంటోన్న స‌మ‌యంలో ఇలా షూటింగ్స్ ఆక‌స్మాత్తుగా ఆప‌డం స‌మ‌జసం కాదని అన్నారు. వాళ్ల‌కు క‌లెక్ష‌న్స్ రావ‌డం లేదనీ ఓటీటీకి ఇవ్వొద్దు అని అంటున్నారు కానీ మా సినిమాల‌కు మీరు థియేట‌ర్స్ ఇవ్వ‌రని విమర్శించారు. నిర్మాత‌లు , డిస్ట్రిబ్యూట‌ర్స్, ఎగ్జిబీట‌ర్స్ అన్నీ ఆ న‌లుగురు నిర్మాత‌లే. తెలంగాణ‌లో ఇంత‌కు ముందు 200 మంది డిస్ట్రిబ్యూట‌ర్స్ ఉండేవారు కానీ ఇప్పుడు ఒక్క‌రూ లేరని అన్నారు.

 వ్య‌తిరేకిస్తున్నామని

వ్య‌తిరేకిస్తున్నామని


కేవ‌లం న‌లుగురైదుగురు నిర్మాత‌ల చేతుల్లో థియేట‌ర్స్ ఉండ‌టం వ‌ల్ల ప్ర‌స్తుతం ఈ ప‌రిస్థితి ఏర్ప‌డిందని అన్నారు. వాళ్లే మీటింగ్స్ పెట్టుకుని వాళ్లే డెసిష‌న్స్ తీసుకోవ‌డం చాలా త‌ప్పనీ, మేము తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నామని అన్నారు. అంతేకాక షూటింగ్స్ ఖచ్చితంగా జ‌రుగుతాయని, ఎవ‌రి షూటింగ్స్ అయినా ఆపితే ప్ర‌భుత్వం ద్వారా, మా చాంబ‌ర్ ద్వారా వారిని ఎదుర్కొంటామని అన్నారు. మరి ప్రొడ్యూసర్స్ గిల్డ్ దీనికి ఏమైనా సమాధానాం చెబుతుందో చూడాలి మరి. ఇక ఈ వివాదం ఇంకా చాలా దూరం వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X