అవమానిస్తే ఊరుకోమంటూ బ్రహ్మానందం కు హెచ్చరిక
తెలంగాణ ప్రాంత కళాకారులను అవమానిస్తే ఊరుకోబోమని, బ్రహ్మానందం తన వైఖరి మార్చుకుని, తెలంగాణ కళాకారులకు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని జైహింద్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఒక ఏడాది పాటు ఆయనను బహిష్కరించాలని ఏపీ ఫిల్మ్ చాంబర్‌ను తెలంగాణ ఫిల్మ్ చాంబర్ తరఫున కోరుతున్నామని, అప్పుడైనా ఆయనలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని రోషం బాలు అన్నారు. ఓ పాపులర్ టీవి ఛానెల్ బ్రహ్మానందం అరాచకాలు అంటూ పోగ్రాం చేసింది. ఈ విషయమై జరిగిన చర్చాగోష్టిలో నిర్మాత, దర్శకుడు సత్యారెడ్డి, నిర్మాత, నటులు రోషం బాలు, జైహింద్ గౌడ్ తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఆయన ద్వారా అణచివేతకు గురవుతూ పేరు బయట పెట్టలేని కమెడియన్లు ఉన్నారంటే బ్రహ్మానందం వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని సత్యారెడ్డి అన్నారు. ఆయన తీరు కళామతల్లికి మాయని మచ్చ అని, ఆయన ఎదురుగా చిన్న నిర్మాతలు ధైర్యంగా కుర్చీలో కూర్చొనే పరిస్థితి లేదన్నారు.తెలంగాణ వారినే కాదు ఆంధ్రా వారినీ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పారు. ఆయన తన వైఖరి మార్చుకుని, తాను అణచివేసిన నటుడితో కలిసి నటించాలని కోరారు. మొన్న ఆదివారం అదే టీవీ ఛానెల్ ఇంటర్వూలో నటుడు,కమిడెయన్,మిమిక్రీ కళాకారుడు శివా రెడ్డి తనను ఓ ప్రముఖ కమిడయన్ తొక్కేసాడంటూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











