»   » తెలంగాణా సినిమా 'ధూం ధాం' రిలీజ్ డేట్..

తెలంగాణా సినిమా 'ధూం ధాం' రిలీజ్ డేట్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రజాకవి గోరటి వెంకన్న ప్రత్యేక పాత్రధారిగా డైలీ 4 షోస్ పతాకంపై వై. వైవస్వత మను నిర్మించిన 'ధూం ధాం' చిత్రం నిర్మాణ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకుని ఈనెల 22న విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సంగతిని నిర్మాత వైవస్వత మను తెలియజేస్తూ "తెలంగాణ ప్రజల మనోభావాలకు ప్రతిరూపం ఈ చిత్రం. తెలంగాణ ప్రజల బ్రతుకులనూ, వారి అవస్థలనూ ఈ చిత్రంలో చూపించాం. గాయని బేబి మధుప్రియ, ప్రముఖ రచయిత, గాయకుడు గోరటి వెంకన్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇటీవలే ఉస్మానియా యూనివర్సిటీలో విడుదలైన ఆడియో సంచలనం సృష్టిస్తోంది.నేను కూడా ప్రధానమైన ఒక జర్నలిస్టు పాత్రను చేశా. తెలంగాణ సాధన కోసం పోరాడి, మృతి చెందిన విద్యార్థులకి ఈ సినిమాని అంకితమిస్తున్నాం. ప్రేక్షకులు తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం" అని చెప్పారు. బ్రహ్మాజీ, రఘునాథరెడ్డి, పద్మాజయంతి, రాంబాబు, వైజాగ్ లక్ష్మి తారాగణమైన ఈ చిత్రానికి రచన, సంగీతం, దర్శకత్వం: శివానంద్ యాలాల.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu