బాలకృష్ణ సినిమాలను ఆపేస్తామని హెచ్చరిక
నందమూరి బాలకృష్ణ సమైక్యాంధ్రకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఫిల్మ్ జేఏసీ డిమాండ్ చేసింది. లేని పక్షంలో తెలంగాణలో బాలకృష్ణ సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించింది. సినీ నటుడు బాలకృష్ణ బసవ తారకం క్యాన్సర్ ఆసుప్రతిలో మంగళవారం ఇస్కాన్ టెంపుల్ వారి ఉచిత అన్నదాన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోకుండా సుభిక్షంగా ఉండాలి" అంటూ వ్యాఖ్యానించారు.
అలాగే తెరాస ఎంపీ విజయశాంతి కూడా ఈ విషయమై మాట్లాడుతూ.. బాలకృష్ణ సమైక్యవాదానికి మద్దతుగా మాట్లాడటం మానకుంటే ఆయన సినిమాలను అడ్డుకుంటామని తెరాస ఎంపీ విజయశాంతి హెచ్చరించారు. తెలంగాణ ప్రేక్షకులతో కోట్లు గడించిన బాలకృష్ణ కనీసం వారి మనోభావాలకు అనుగుణంగానైనా మాట్లాడకుండా సమైక్యంగా ఉండాలని వ్యాఖ్యానించడం శోచనీయమని పేర్కొన్నారు. అమరుల ఆత్మకు శాంతి కలుగకుండా, కనీసం నివాళులు కూడా అర్పించని బాలకృష్ణ ఈ విధమైన వ్యాఖ్యానాలు చేయడం తెలంగాణ ప్రజలను కించపరచడమేనని వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోకపోతే త్వరలో విడుదల కానున్న శ్రీరామ రాజ్యం చిత్రాన్ని అడ్డుకోవడంపై ఆలోచిస్తామన్నారు. బాలకృష్ణ నటించిన శ్రీరామ రాజ్యం త్వరలో విడుదల కానుంది.
ప్రస్తుతం బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం నవంబర్ 17న విడుదల కానుంది.అలాగే ఆయన నటిస్తున్న కీర్తి కంబైన్స్ చిత్రం, మంచు లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్న ఊకొడతారా ఉలిక్కి పడతారా నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంకా బి.గోపాల్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించే చిత్రంతో పాటు, జయంత్ దర్శకత్వంలో కూడా ఆయన ఓ చిత్రంలో నటించనున్నారు.


Click it and Unblock the Notifications