ఫిల్మ్ చాంబర్లో తెలంగాణ సంబరాలు...(ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఫిలిం చాంబర్లో కేక్ కట్ చేసి సంబరాల్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు నారాయణరాజు మాట్లాడుతూ...60 ఏళ్ల తెలంగాణ ప్రజల కల సాకారం అయింది. తెలుగు సినిమా ఇరు ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలి అని అన్నారు.
రాష్ట్ర విభజనతో నేటితరం వారు అదృష్టవంతులు...ఇపుడు ఇరు ప్రాంతాలలో యువతకు మంచి భవిష్యత్ ఉంటుంది, తెలంగాణ ప్రాంతానికే కాకుండా ఆంధ్రప్రాంతం అభివృద్ధికి కూడా ఇది మంచి అవకాశం. తెలుగు సినిమా ఎప్పుడూ పచ్చని తోరణంలా కళకళలాడాలి. తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్దికి మా వంతు కృషి చేస్తాం. ప్రభుత్వానికి తగిన సలహాల్ని ఇస్తామని టిఎఫ్‌జెఏ అధ్యక్షుడు ఎం.లక్ష్మీనారాయణ తెలిపారు.
మిగతా వివరాలు స్లైడ్ షోలో....

తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్టుల సంబరాలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిలిం జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ జరిగాయి.

రెండు ప్రాంతాల్లోనూ...
ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవానికి కారణమైంది. రెండు ప్రాంతాల్లోనూ సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలి అని టిఎఫ్ జేఏ ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు.

మావంతు తోడ్పాటు
ఆంధ్ర తెలంగాణ ఇరు ప్రాంతాల్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడతామని జనరల్ సెక్రటరీ జి.శ్రీనివాసరావు తెలిపారు.

తెలంగాణ సినిమా
ఈ కార్యక్రమంలో మాడూరి మధు, రమేష్ చిన్నముల, సతీష్, దయ్యాల అశోక్, వెంకట్, శ్రీనివాసరావు, సురేష్ కొండి తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











