సినిమా షూటింగుకు పోలీసుల ఇబ్బందులు ఇక ఉండవు
హైదరాబాద్: సినిమా షూటింగులకు స్థానిక పోలీసులు అనుమతులు ఇక అవసరం లేదు. దీంతో షూటింగుల సమయంలో అనుమతుల పేరుతో నిర్మాతల పడే ఇబ్బందులకు తెర పడింది. షూటింగ్‌లకు అనుమతుల విషయంలో ప్రస్తుతం ఉన్న విధానాన్ని రద్దుచేసి సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ అన్ని జిల్లాలకు, జిల్లాల ఎస్.పిలకు సర్క్యులర్లు జారీచేశారు.
పోలీసు శాఖ అనుమతి విషయంలో ఎదుర్కొంటున్న సమస్యపై తెలంగాణ డిజిపి అనురాగ శర్మను తెలంగాణ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కలిసింది. సినీ నిర్మాతల సమస్యను అర్థం చేసుకున్న డిజీపీ అనురాగ్ శర్మ వెంటనే సానుకూలంగా స్పందించారు. ఇక నుండి సినిమా షూటింగ్‌లకు ఎఫ్‌డిసి నుండి తెచ్చిన లెటర్ చూపిస్తే సరిపోతుందని, పోలీస్ స్టేషన్ నుండి ఎటువంటి లేఖ అవసరం లేదని ఆయన తెలిపారు.

డీజీపీ అనురాగ్ శర్మ నిర్ణయంపై తెలంగాణ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ హర్షం వ్యక్తం చేసారు. గతంలో అనుమతుల కోసం ఎఫ్‌డిసినుండి లెటర్ తెచ్చాక కూడా పోలీసు అధికారుల అనుమతి తీసుకోవాల్సి వచ్చేదని, దీంతో షూటింగ్‌లు ఆలస్యమై ఆర్టిస్టుల కాల్షీట్లు వృధా అయ్యేవని, ఇపుడు ఆ సమస్య తీరిందని సంతోషం వ్యక్తం చేసారు.
ఇకపై ఎఫ్‌డిసి నుండి తెచ్చిన లెటర్ ఉంటే....స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ప్రత్యుకంగా ఎలాంటి అనుమతి అవసరం లేదు. అయితే స్థానిక పోలీస్ స్టేషన్‌కు షూటింగుకు సంబంధించిన వివరాలు తెలియజేసి అక్కడి అధికారుల నుండి ఒక సంతకం మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications