twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGF 2కి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. రేట్లు ఎంత పెంచారంటే?

    |

    మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలలో ఒకటైన KGF చాప్టర్ 2 కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారు అనేది చెప్పాల్సిన పని లేదు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన KGF చాప్టర్ 1 క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ఇప్పుడు ఇతర తెలుగు సినిమాలకు, RRR లాంటి పాన్ ఇండియా సినిమాలకు సైతం షాక్ ఇచ్చే విధంగా మార్కెట్ చేస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో RRRను దాటిన ఈ సినిమాకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది . ఆ వివరాలు

    అనేక వాయిదాల అనంతరం

    అనేక వాయిదాల అనంతరం


    KGF చాప్టర్ 2' సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే అయినా కారోనా లాంటి అనేక కారణాలతో అనుకున్న సమయానికి దీన్ని పూర్తి చేయ లేదు. అయితే అలాంటి పరిస్థితుల్లో దీంతో ఈ సినిమాను గత ఏడాదే డిసెంబర్‌లోనే విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని 2022, ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

    గుడ్ న్యూస్

    గుడ్ న్యూస్


    భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీలో యశ్ హీరోగా నటించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.
    ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. రవి బస్రూర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక పెద్ద బడ్జెట్ సినిమాలకు అండగా నిలుస్తూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా విషయంలో కూడా గుడ్ న్యూస్ చెప్పింది.

     పాన్ ఇండియా లెవల్ లో

    పాన్ ఇండియా లెవల్ లో


    ఈ సినిమా ఏప్రిల్ నెల 14న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. కన్నడతో పాటు తెలుగు, హిందీ, మలయాళం భాషల్లోనూ కేజీఎఫ్‌ రిలీజ్‌ అవుతోంది. అయితే మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం మూవీ రిలీజైన తర్వాత తొలి నాలుగు రోజులకుగాను టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏసీ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో టికెట్ల రేట్లు పెరగనుండగా.. నాన్‌ఏసీలో మాత్రం అవే రేట్లు ఉండనున్నాయి.

     జీవో జారీ

    జీవో జారీ


    ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో కూడా జారీ చేసింది. ప్రభుత్వం అనుమతించిన దాని ప్రకారం మల్టీస్క్రీన్లు, ఐమ్యాక్స్‌లలో రూ.50 వరకూ టికెట్‌ ధర పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇక ఏసీ థియేటర్లలో రూ.30 పెంచుకోవచ్చు. అయితే తాజాగా ఒక ప్రెస్ మీట్ లో మూవీ టికెట్ల ధరలు పెంచుకోవడానికి తాము తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను అనుమతి కోరినట్లు మూవీ మేకర్స్‌ సోమవారం చెప్పిన సంగతి తెలిసిందే.

     కలిసి వచ్చేలా

    కలిసి వచ్చేలా


    సినిమా ప్రమోషన్లలో భాగంగా సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో సినిమా యూనిట్ పర్యటించింది. మొత్తం మీద టికెట్ రేట్లు వ్యవహారం తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ కు కలిసి వచ్చే అంశంగా మారుతుందని చెప్పక తప్పదు

    English summary
    Telangana government gave chance to hike of KGF 2 ticket rates
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X