twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలంగాణలోని సినీ ప్రియులకు గుడ్‌ న్యూస్: ప్రత్యేక జీవో జారీ చేసిన ప్రభుత్వం

    |

    కరోనా వైరస్ ప్రభావంతో దేశంలోని సినిమా హాళ్లు, మల్టీఫ్లెక్స్‌లు చాలా కాలం పాటు మూతపడిన విషయం తెలిసిందే. దాని ప్రభావం తగ్గిన తర్వాత యాభై శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లు తెరవవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం అనుమతులు ఇచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లతో పాటు మల్టీఫ్లెక్స్‌లు సైతం సగం సిటీంగ్‌తో సినిమాలను ప్రదర్శించాయి. ఎంతో కీలకమైన సంక్రాంతి సీజన్ కూడా అదే విధంగా నడిచింది. ఇప్పుడు వైరస్ ప్రభావం తగ్గడంతో సినిమా హాళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    కరోనా మహమ్మారి తీవ్రత తగ్గడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయిన నేపథ్యంలో దేశంలోని అన్ని సినిమా హాళ్లలో వంద శాతం సీటింగ్‌తో సినిమాలు ప్రదర్శించుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే, అందుకే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం అంటూ ఓ మెలిక పెట్టింది. దీంతో చాలా చోట్ల ఫుల్ సీటింగ్‌తో సినిమాలు మొదలైపోయాయి. కానీ, తెలంగాణలో మాత్రం వంద శాతం ఆక్యూపెన్సీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించలేదు. దీంతో ఫిబ్రవరి 1 నుంచి కూడా యాభై శాతం సీట్లతోనే సినిమాలు నడుస్తున్నాయి.

    Telangana Government Green Signal to 100 percent seating capacity in Theatres

    తాజాగా తెలంగాణలోని సినీ ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు సీఎస్ కార్యాలయం ఓ జీవోను సైతం జారీ చేసింది. 'థియేటర్లలో వంద శాతం సీటింగ్ కెపాసిటీకి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కూడా దానికి అంగీకరిస్తుంది' అని అందులో పేర్కొంది. అదే సమయంలో థియేటర్ యాజమాన్యాలకు కేంద్ర ప్రభుత్వం సూచించిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్స్‌‌ను కూడా పాటించాలని చెప్పింది. మరీ ముఖ్యంగా ప్రతి సినిమా హాల్, మల్టిఫ్లెక్స్‌ల్లో హ్యాండ్ శానిటైజర్లు వాడాలని సూచించింది. అంతేకాదు, థియేటర్లలో ఉమ్మి వేయడాన్ని నిషేదించింది.

    English summary
    The Ministry of Home Affairs on Saturday allowed cinema halls to operate at 100% seating capacity from February 1 onwards. The Ministry of Information & Broadcasting also issued a new set of SOPs for cinema halls and theatres to prevent spread of coronavirus.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X