twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగ్‌లు జరపాలంటే ఇవి పాటించాల్సిందే.. ప్రభుత్వ నిబంధనలు వైరల్

    |

    తెలంగాణ ప్రభుత్వం షూటింగ్‌లు జరుపుకోవడానికి అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల దెబ్బతిన్న సినీ పరిశ్రమను ఆదుకునేందుకు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ షూటింగ్‌లు జరుపుకోవాలని ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. అయితే స్పష్టమైన మార్గదర్శకాలను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. ఇకపై ఈ నిబంధనలను పాటిస్తూనే షూటింగ్‌లు జరుపుకోవాల్సి ఉంటుంది. ఆ నియమ నిబంధనలేమిటో ఓ సారి చూద్దాం.

    నిర్మాతదే బాధ్యత..

    నిర్మాతదే బాధ్యత..


    అన్నిటికి బాధ్యత వహిస్తూ ప్రొడ్యూసర్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నటీనటులు సిబ్బంది ఆరోగ్య భాద్యత నిర్మాతదేనని తేల్చి చెప్పింది. ప్రతి రోజూ ఉదయాన్నే భౌతికదూరం గురించి చిత్ర యూనిట్ కు వివరించాలని స్పష్టంగా పేర్కొంది.

    ప్రతీఒక్కరూ మాస్క్..

    ప్రతీఒక్కరూ మాస్క్..

    షూటింగ్ ప్రాంతాల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని సూచించింది. మేకప్ ఇంటి వద్దే వేసుకునే వచ్చేలా చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చింది. చిన్న పిల్లలు వయసు మీద పడిన వారు షూటింగ్స్ పాల్గొనాలంటే డాక్టర్, ప్రభుత్వ అనుమతి అనివార్యమని తెలిపింది.

    తక్కువ మందితో..

    తక్కువ మందితో..

    ఇండోర్ షూటింగ్‌లకే ప్రాధాన్యత ఇవ్వాలని, 40 మంది కంటే ఎక్కువ మంది లేకుండా చూసుకోవాలని తెలిపింది. ఎంట్రీ ఎగ్జిట్ గేట్ ప్రాంతాల్లో తప్పనిసరిగా శానిటైజర్ హ్యాండె వాష్ అందుబాటులో ఉంచాలని, ఆరోగ్య సేతును ప్రతీఒక్కరూ డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొంది.

    కంటైన్మెంట్ జోన్లలో షూటింగ్ లు చేయకూడదని, వీలైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్ లు జరపకూడదని హెచ్చరించింది. మేకప్ వేసుకున్నా ఆర్టిస్టులు ఫేస్ షీల్డ్ ను ఉపయోగించాలని, మేకప్ ఆర్టిస్టులు హెయిర్ డ్రస్సర్లు పీపీఈ కిట్లు ధరించాలని పేర్కొంది.

    Recommended Video

    Sri Reddy Wishes Balakrishna & Slams Mega Family, Post Gone Viral
    పెద్ద సినిమాలు పర్మిషన్ తీసుకోవాలి..

    పెద్ద సినిమాలు పర్మిషన్ తీసుకోవాలి..


    పెద్ద సినిమాలకి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలని, సగం పూర్తయిన సినిమాలు టీవీ సీరియళ్ల షూటింగ్‌లకు మాత్రమే అనుమతి అని స్పష్టంగా చెప్పింది. ప్రతి ఒక్కరి నుంచి మెడికల్ డిక్లరేషన్ తప్పనిసరి , షూటింగ్ లో మాస్క్ భౌతికదూరం మస్ట్, పాన్ సిగరెట్లు నిషేధమని తెలిపింది. షూటింగ్ ఏరియాలో తప్పనిసరిగా డాక్టర్ ఉండాల్సిందేనని పేర్కొంది. కార్లను శానిటైజ్ చేసిన తర్వాతే ఆర్టిస్టుల దగ్గరికి పంపాలని, నటీనటుల ఎంపిక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగాలని నిబంధనలను విడుదల చేసింది.

    English summary
    Telangana Government Guidelines To Start Shooting. After Meeting Tollywood Celebraties With CM KCR They Given NOd To Start Shootings According to Rules.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X