RRR సినిమాకు మరో గుడ్ న్యూస్..టికెట్ రెట్లు పెంచుతూ జీవో జారీ చేసిన తెలంగాణ సర్కార్.. ఎక్కడెక్కడ ఎంతంటే?
రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా RRR. సుమారు 400 కోట్ల రూపాయలతో ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. అయితే ప్రస్తుతం వంద రోజుల పాటు సినిమాలు నడిచే అవకాశం లేకపోవడంతో సినిమా మొదటి వారం పది రోజుల పాటు ఎంత కలెక్షన్లు సాధిస్తే అంతే కలెక్షన్లు సినిమా ఫైనల్ కలెక్షన్స్ గా నిలుస్తున్నాయి.. అందులో భాగంగానే ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచమని రాజమౌళి సహా సినిమా యూనిట్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేయగా ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక జీవో జారీ చేసింది.. వివరాల్లోకి వెళితే

RRR
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన తాజా చిత్రం RRR. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రలో స్వాతంత్ర సమరయోధుల పాత్రల్లో నటిస్తున్నారు. వీరికి జంటగా బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు.. వీరు కాకుండా రాజీవ్ కనకాల, అజయ్ దేవగన్, శ్రేయ, రాహుల్ రామకృష్ణ ఇలా అనేక మంది పేరు నటీనటులు కూడా నటిస్తున్నారు.

కీలక నిర్ణయం
ఈ సినిమా బడ్జెట్ సుమారు 450 కోట్ల రూపాయలు అయిన కారణంగా ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకుంటామని ప్రభుత్వాన్ని ఈ సినిమా నిర్మాతలు ముందు నుంచి కోరుతూ వస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు 75 రూపాయలు రేటు పెంచుకునే అవకాశం కల్పించగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై ఒక కీలక నిర్ణయం వెలువరించింది.

ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మార్చి 25 న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా విడుదలైన మొదటి 10 రోజులకు ప్రత్యేక టిక్కెట్ ధరలను నిర్ణయించడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. తొలి పది రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు ఐదు షోలు ప్రదర్శించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పెంచి అమ్మకునేందుకు అనుమతి
అలాగే, మల్టీప్లెక్స్‌లలో మార్చి 25 నుండి మొదటి 3 రోజుల పాటు రూ. 70 - రూ. 100 (సాధారణ & రిక్లైనర్) అలాగే తదుపరి 7 రోజులకు రూ. 50 అదనంగా పెంచుకునే అవకాశం కల్పించింది. AC సింగిల్ స్క్రీన్‌ల కేటగిరీ కోసం, మూడు రోజులకు రూ. 50, తదుపరి 7 రోజులకు రూ. 30 అదనంగా పెంచి అమ్మకునేందుకు అనుమతించబడింది.

GO జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త GO జారీ చేసిన రెండు రోజుల తర్వాత తెలంగాణ జీవో జారీ చేసింది. ఇక మొదటి వారాంతంలో RRRకి అందించబడిన అదనపు రేట్లు వర్తిస్తాయి. రెండు రాష్ట్రాల టిక్కెట్ల పెంపుపై ఇప్పటివరకు సోషల్ మీడియాలో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది ఇంత రేట్ పెట్టడం అవసరమా? అని ప్రశ్నిస్తుంటే మరికొంత మంది మాత్రం సమర్థిస్తున్నారు.


Click it and Unblock the Notifications











