twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్వయంకృషితో మెగాస్టార్‌గా.. చిరంజీవికి గవర్నర్ తమిళిసై బర్త్ డే విషెస్, గంటా, RRR, సోము వీర్రాజు!

    |

    మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకొని సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. కరోనావైరస్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చిరంజీవి ఇంటికే పరిమితమై తన జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళ సై తదితరులు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. మెగాస్టార్‌కు బర్త్ డే విషెస్ అందించిన వారిలో...

    నటనా కౌశలంలో మరింతగా

    నటనా కౌశలంలో మరింతగా

    చిరంజీవికి బర్త్ డే విషెస్ సందేశాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ట్విట్టర్‌ ద్వారా అందజేస్తూ.. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ అద్భుతమైన నటనాకౌశలంతో ప్రేక్షకులను మరింతగా అలరించాలని ఆశిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడానికి మంచి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకొంటున్నాను.మీ కెరీర్‌లో మరిన్నీ గొప్ప మైలురాళ్లు అందుకోవాలని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

     మీతో మధురమైన మెమొరీస్

    మీతో మధురమైన మెమొరీస్

    ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత చిరంజీవితో రాజకీయ నేత గంటా శ్రీనివాసరావుతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. చాలాకాలంంగా సన్నిహితంగా ఉంటున్నారు. చిరంజీవితోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రిగా పనిచేశారు. తన సన్నిహితుడైన చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తూ.. మీతో ఉన్న మధురమైన జాపకాలు ఎప్పటికీ మరిచిపోలేనివి. చెరిగిపోలేనివి అన్నయ్య.. హ్యాపీ బర్త్ డే అంటూ గంటా శ్రీనివాసరావు విషెస్ అందించారు.

    152 కోసం వేచి చూస్తున్నా

    152 కోసం వేచి చూస్తున్నా

    మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు అందజేసిన వారిలో ఎంపీ కే రఘురామ కృష్ణ రాజు కూడా ఉన్నారు. నా ప్రియమిత్రుడు, పద్మ భూషణ్ శ్రీ చిరంజీవి గారికి నా తరఫున జన్మదిన శుభాకాంక్షలు అందిస్తున్నాను. ఎంతో మంది అభిమానుల మాదిరిగానే నేను మీ 152వ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

    స్వయంకృషితో మెగాస్టార్‌గా

    స్వయంకృషితో మెగాస్టార్‌గా

    పద్మభూషణ్ చిరంజీవికి బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదిగారు. తెలుగు చిత్ర పరిశ్రమే వన్నె తెచ్చిన మీ సినీ ప్రస్థానం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిదాయకం. తెలుగింటి అభిమాన నటుడిగా ప్రజా హృదయాల్లో తనదైన ముద్ర వేసుకొన్న మిత్రులు. శ్రేయోభిలాషి శ్రీ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

    Recommended Video

    Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
    నాకు అత్యంత ఆప్తుడు

    నాకు అత్యంత ఆప్తుడు

    ఏపీ రాజకీయ నేత, వ్యాపారవేత్త కేశినేని నాని కూడా చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. తెలుగువారి అభిమాన నటుడు, నాకు అత్యంత ఆప్తుడు చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ నాని ట్వీట్ చేశారు. చిరంజీవితో అత్యంత ఆనంద క్షణాలు ప్రతిబింబించే ఫోటోను కేశినేని నాని ట్యాగ్ చేశారు.

    English summary
    Telangana Governor Dr Tamilisai Soundararajan wishes megastar Chiranjeevi on his birthday
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X