Ticket Rates: ప్రభాస్ మూవీకి ప్రభుత్వం గుడ్ న్యూస్.. టికెట్ రేట్లను ఎలా నిర్ణయించారంటే!

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగానే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి భారీ సినిమాలు రూపొందుతోన్నాయి. అందులో చాలా వరకూ పాన్ ఇండియా రేంజ్‌లోనే చిత్రాలు తెరకెక్కుతోన్నాయి. ఇలా ఇప్పటికే చాలా సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ఈ క్రమంలోనే మరికొన్ని సినిమాలు కూడా లైన్‌లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అలా రాబోతున్న మరో హై లెవెల్ మూవీనే 'కల్కి 2898 ఏడీ'. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రమే 'కల్కి 2898 ఏడీ'. హాలీవుడ్ రేంజ్‌లో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. దీనికితోడు ఈ చిత్రంలో ఎంతో మంది స్టార్లు కూడా ఉండడంతో దీని కోసం అందరూ వేచి చూస్తున్నారు.

Telangana Govt Granted Permission to Hike Prabhas Starrer Kalki 2898 AD Movie Ticket Rates

విజువల్ వండర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'కల్కి 2898 ఏడీ' మూవీని జూన్ 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు ఈవెంట్లను కూడా నిర్వహించారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ఈ సినిమా హడావిడే కనిపిస్తోన్న విషయం అందరికీ తెలిసిందే.

టాలీవుడ్ నుంచి వచ్చే భారీ చిత్రాలకు స్పెషల్ షోలు, టికెట్ రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెసలుబాటు కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా 27 జూన్ నుంచి జూలై 4వ వరకూ ఐదు షోలు వేసుకునేందుకు పర్మీషన్ ఇచ్చేసింది.

Telangana Govt Granted Permission to Hike Prabhas Starrer Kalki 2898 AD Movie Ticket Rates

అంతేకాదు, ఇప్పుడు తెలంగాణలో అమలులో ఉన్న టికెట్ రేట్లకు సింగిల్ స్క్రీన్స్‌లో 100, మ‌ల్టీప్లెక్స్‌లో 75 వ‌ర‌కు పెంచుకునే వెసులుబాటును రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ల్పించింది. దీంతో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్లలో 'కల్కి 2898 ఏడీ' టికెట్ రేట్లు రూ. 265, మ‌ల్టీప్లెక్స్‌లో రూ 413 అయ్యాయి. దీంతో చిత్ర యూనిట్, బయ్యర్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. 'కల్కి 2898 ఏడీ' సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, మాళవిక నాయర్, శోభనలు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్‌ను ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X