Dimple Hayathi: అరెస్టుపై హైకోర్టుకు డింపుల్ హయాతి పిటిషన్.. న్యాయస్థానం ఏం చెప్పిందంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ మూవీలోని ఐటమ్ సాంగ్ తో సూపర్ పాపులర్ అయిన బ్యూటి డింపుల్ హయాతి. సూపర్ హిట్టు నీ హైటు అంటూ తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత హీరోయిన్ గా సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న ఈ డస్కీ సుందరి ఇటీవల ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో జరిగిన వివాదం సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంలో తన అరెస్ట్ విషయంలో హైకోర్టుకు ఓ పిటిషన్ వేసింది ఈ బ్యూటి. అయితే ఆమె పిటిషన్ పై కోర్టు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ప్లాప్ కావడం: ఐటమ్ సాంగ్స్ తో మెప్పించిన ముద్దుగుమ్మ డింపుల్ హయాతి తర్వాత రవితేజ ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి పేరు దక్కించుకుంది. ఇందులో అదిరిపోయే అందాలను హాట్ గా ఎక్స్ పోజ్ చేసి ఆకర్షించింది. ఇటీవలే గోపీచంద్ సరసన నటించిన ఈ చిన్నది రామబాణం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కూడా ప్లాప్ కావడంతో డింపుల్ కు నిరాశ ఎదురైంది.

Telangana High Court Comments On Dimple Hayathi Arrest Over DCP Rahul Hegde Case

ఆరోపణలు: ఇక డింపుల్ సినీ పర్సనల్ విషయాల్లోకి వెళితే.. ఇటీవలే ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో ఆమెకు గొడవ జరిగిన విషయం తెలిసిందే. అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ విషయంలో వీరిద్దరి మధ్య చోటుచేసుకొన్న గొడవ రకరకాల మలుపు తిరిగింది. విధులకు ఆటంకం కలిగించే విధంగా తన కారుకు అడ్డంగా పార్కింగ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తుందన్న ఆరోపణలతో డింపుల్ పై డీసీపీ కేసు నమోద్ చేశారు.

Telangana High Court Comments On Dimple Hayathi Arrest Over DCP Rahul Hegde Case

డింపుల్ ట్వీట్స్: డీసీపీ రాహుల్ హెగ్డే కేసు నమోదు తర్వాత తనపై తప్పుడు కేసు బనాయించారని ఆరోపిస్తూ హీరోయిన్ డింపుల్ కూడా కేసు పెట్టిన పోలీసులు తీసుకోలేదు. ఈ విషయంలో డింపుల్ తప్పు ఏం లేదని, పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని హీరోయిన్ లాయర్ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. ఈ సంఘటన నుంచి పోలీసులపై పలు రకాలుగా ట్వీట్లు చేస్తూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Telangana High Court Comments On Dimple Hayathi Arrest Over DCP Rahul Hegde Case

తప్పుడు కేసు: కాగా ఇటీవల పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని డింపుల్ హయాతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును ఢీకొట్టిన కేసును కొట్టివేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించింది. అధికారం ఉందని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఒత్తిడి చేయడంతో పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారని పిటిషన్ లో పేర్కొన్న డింపుల్ అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని కోరింది.

Telangana High Court Comments On Dimple Hayathi Arrest Over DCP Rahul Hegde Case

నోటీసులుకు తగినట్లు: డింపుల్ హయాతి పిటిషన్ బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఆమెకు సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు తెలిపారు. సీఆర్పీసీ 41ఏ నిబంధనల ప్రకారమే పోలీసులు నడుచుకోవాలని హైకోర్ట్ సూచించింది. ఆ నోటీసులకు అనుగుణంగానే డింపుల్ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

హైకోర్ట్ ఆదేశం: ఈ కేసులో నిందితుడిగా ఉన్న లాయర్ విక్టర్ డేవిడ్ కు కూడా 41ఏ నోటీసులు ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు సూచించింది. సీఆర్పీసీ 41ఏ నోటీసులు అందుకున్న వారు చట్టాని అనుసరించి విచారణకు హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X