Allu Arjun Bail: అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్.. మరీ జైలు తప్పినట్లేనా..

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందడంతో మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. నేడు అల్లు అర్జున్ ని పోలీసులు అదుపు తీసుకున్నారు. అనంతరం చిక్కడపల్లి పోలీసులు నాంపెల్లి కోర్టు ముందు హాజరు పరచారు.

కానీ, నాంపెల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు ఊహించని షాక్ తగిలింది. కేసు తీవ్రత దృష్ట్యా నాంపల్లి కోర్టు.. అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించాలని నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అల్లు అర్జున్ రావడం వల్లనే తొక్కిసలాట ఘటన జరిగిందనే పోలీసుల వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. దీంతో అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించారు.

Telangana High Court granted interim bail to Allu Arjun

దీంతో అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు క్వాష్‌ చేయాలని అల్లు అర్జున్ పిటిషన్‌ వేశారు. సంధ్య ధియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఏ11గా ఉన్నారు. ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్ చేశామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. అల్లు అర్జున్‌కు బెయిల్ ఇవ్వొద్దని జీపీ వాదనలు వినిపించారు. దీంతో కోర్టు ఏకీభవించింది.

అల్లు అర్జున్ అరెస్టు అయినందున ఆయనకు బెయిల్‌ అవసరమైతే మరో పిటిషన్‌ దాఖలు చేయాలని సూచించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి క్వాష్‌ పిటిషన్‌లోనే మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని వాదనలు వినిపించారు. అల్లు అర్జున్ కు సపోర్టుగా నిలుస్తూ.. ఉన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. అల్లు అర్జున్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఉత్కంఠంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X