Venu Swamy: వేణు స్వామికి షాకిచ్చిన హైకోర్టు.. వారం రోజుల్లో చర్యలకు ఆదేశం..

Venu Swamy: తెలుగు రాష్ట్రాల్లోని సినీ సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ వ్యక్తిగత, ప్రొఫిషనల్ లైఫ్‌కు సంబంధించి జ్యోతిష్యం చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. ఇలా ప్రముఖుల జాతకాలు చెప్పి వార్తల్లోకి ఎక్కారు. అయితే.. వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వారం రోజుల్లో వేణు స్వామిపై చర్యలు తీసుకోవచ్చునని తెలంగాణ మహిళా కమిషన్‌కు ఆదేశించింది. ఇంతకీ ఏమైందంటే..?

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.. నాగ చైతన్య - సమంతల పెళ్లి తర్వాత వీరిద్దరూ విడిపోతారని సంచలన జ్యోతిష్యం చెప్పాడు. ఆ తర్వాత ఆయన జ్యోతిష్యం చెప్పినట్లుగానే విభేదాలతో చైతూ సామ్ విడాకులు తీసుకున్నారు. దీంతో వేణు స్వామి పేరు మారుమోగిపోయింది. టాలీవుడ్‌తో పాటుగా.. కోలీవుడ్, బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఫేమస్ అయిపోయాడు. సెలబ్రెటీలతో పూజలు చేయించుకుంటూ పాపులర్టీ సంపాదించుకున్నారు.

Telangana High Court Lifts Venu Swamy Stay order and Clears Path to Women Commission Notice

అయితే.. గత కొన్ని రోజులుగా నాగ చైతన్య, శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. వీరి ఎంగేజ్మెంట్ తరువాత వివాదాస్పద రీతిలో జాతకం చెప్పారు. వివాహం అనంతరం వారిద్దరు ఎప్పుడు విడాకులు తీసుకుంటారో అనే విషయంపై వేణు స్వామి జ్యోతిష్యం చెప్పాడు. ఆయన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ తరుణంలో వేణు స్వామి వ్యాఖ్యలపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

Telangana High Court Lifts Venu Swamy Stay order and Clears Path to Women Commission Notice

అయితే వేణు స్వామి పై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు మేరకు తన ముందు హాజరు కావాలని గతం లో వేణుని ఆదేశించింది మహిళా కమిషన్. ఈ ఆదేశాలపై వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. తనని విచారణకు పిలిచే అధికారం కమిషన్‌కు లేదంటూ హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. అయితే.. ఈ రోజు ఆ స్టే ఎత్తివేస్తూ.. వేణుస్వామిని విచారించేందుకు మహిళా కమిషన్‌కు పూర్తి అధికారాలున్నాయని హైకోర్టు స్పష్టం చేసింది.

అదేవిధంగా.. వారం రోజుల్లో వేణు స్వామిపై చర్యలు తీసుకోవాలని కమిషన్ ను ఆదేశించింది కోర్టు. ఈ క్రమంలో వేణు స్వామిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

More from Filmibeat

Read more about: venu swamy naga chaitanya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X