twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మహర్షి’ టిక్కెట్ రేట్ల వివాదం: థియేటర్ ఓనర్స్ విన్నపాన్ని తోసిపుచ్చిన హైకోర్ట్

    |

    'మహర్షి' మూవీ టికెట్ రేట్లు పెంపు విషయంలో థియేటర్ల యాజమాన్యాలకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఉందని, తమకు గిట్టుబాటు కావడం లేదని యాజమాన్యాలు పెట్టుకున్న వినతిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తసుకోవడం లేదు.

    దీంతో థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. 'మహర్షి' సినిమా విషయంలో తాము రేట్లు పెంచుకునేలా అనుమతించేలా ప్రభుత్వానికి సూచనలు చేయాలని తమ పిటీషన్లో కోరారు. అయితే వీరి పిటీషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ తోసిపుచ్చారు.

    మహర్షి మూవీ రివ్యూమహర్షి మూవీ రివ్యూ

    థియేటర్ల యజమానులు స్టేట్ సినిమా(రెగ్యులేషన్) చట్టాన్ని ఫాలో అవ్వాలని, వినియోగదారుల హక్కులు కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. థియేటర్ల యజమానులు పెట్టుకున్న వినతిపై మే 16లోగా నిర్ణయం తీసుకోవాలని లైసెన్సింగ్‌ అథారిటీ, నగర పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

     Telangana High Court rejected the pleas of cinema theatre managements

    ఐనాక్స్‌, పీవీఆర్‌, జీవీకె, సినీమాక్స్‌తో సహా మరికొన్ని థియేటర్ల యాజమాన్యాలు టికెట్ రేట్ల పెంపు విషయంలో కోర్టును ఆశ్రయించారు. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు టికెట్‌ ధరల పెంపుపై సిఫార్సులు చేయడానికి ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిందని, అయితే కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు.

    వేసవిలోగా కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ లోపే మహర్షి లాంటి పెద్ద సినిమా వచ్చింది. ఇప్పటికైనా నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వం ముందుకు రావాలని థియేటర్ల యజమానులు కోరుతున్నారు.

    English summary
    Telangana High Court rejected the pleas of cinema theatre managements to direct the state government or allow them to hike ticket rates for the recently released Mahesh Babu starrer movie Maharshi. Justice Chauhan directed the police commissioners of respective areas to decide on the petitioner’s applications by May 16.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X