twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలంగాణ లాక్‌డౌన్: ఒక్కో కార్డుకు 1500 రూపాయలు.. కేసీఆర్ డిసీషన్‌పై విజయశాంతి రియాక్షన్

    |

    కరోనా కల్లోలానికి దేశ ప్రజలు వణికిపోతున్నారు. రోజు రోజుకూ కరోనా తీవ్రత పెరుగుతుండటం ప్రజల్లో భయాందోళన నింపుతోంది. ఈ నేపథ్యంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణ పట్ల కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ తన మద్దతు తెలిపింది విజయశాంతి. వివరాల్లోకి పోతే..

    జనతా కర్ఫ్యూ సక్సెస్.. కేసీఆర్ డిసీషన్‌

    జనతా కర్ఫ్యూ సక్సెస్.. కేసీఆర్ డిసీషన్‌

    కరోనా కట్టడిలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపును జనమంతా సక్సెస్ చేశారు. మార్చి 22న ప్రజలంతా ఇళ్లకే పరిమితమై సామాజిక దూరం పాటించాలనీ కోరగా దేశ ప్రజలందరూ కట్టుబడి ఉన్నారు. కరోనాను అంతమొందించడం కోసం తమ వంతుగా సహకారం అందించారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ డిసీషన్‌ తీసుకున్నారు.

    మార్చి 31 దాకా లాక్ డౌన్..

    మార్చి 31 దాకా లాక్ డౌన్..

    మార్చి 22 లాగానే మార్చి 31 దాకా తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. స్కూల్స్, థియేటర్స్, ఆఫీసెస్, షాపింగ్ మాల్స్, వైన్స్, బార్స్, పబ్బులు, పార్కులు, దేవాలయాలు ఏవీ ఓపెన్ చేయకూడదని.. కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని, అది కూడా కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే అనుమతి అని తెలిపారు.

    అదొక్కటే సరైన మార్గం.. కేసీఆర్ నిర్ణయం

    అదొక్కటే సరైన మార్గం.. కేసీఆర్ నిర్ణయం

    ఈ మేరకు ప్రజలంతా జనతా కర్ఫ్యూలో ఎలా భాగమయ్యారో.. మార్చి 31 దాకా కూడా అలానే ఇళ్లకు పరిమితం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా విజృంభణను అరికట్టేందుకు సామాజిక దూరం ఒక్కటే సరైన మార్గం అని తెలుసుకున్న జనం సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు.

    ఒక్కో కార్డుకు 1500 రూపాయలు

    ఒక్కో కార్డుకు 1500 రూపాయలు

    ఈ లాక్ డౌన్ కారణంగా ప్రతి తెల్ల రేషన్ కార్డుకు నెలకు 12 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తామని, అదేవిధంగా ఒక్కో కార్డుకు రూ.1500 ఇస్తామని వెల్లడించారు. ఇందుకోసమై 1314 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రోడ్లపై బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు ఏవీ నడవబోవని, ప్రజారవాణా అందుబాటులో ఉండదని కేసీఆర్ తెలిపారు.

    Recommended Video

    Sarileru Neekevvaru @50 Days | Mahesh Babu Emotional Tweet

    రాజకీయాలకతీతంగా! విజయశాంతి రియాక్షన్

    కాగా తాజాగా సినీ నటి, రాజకీయవేత్త విజయశాంతి ఈ లాక్ డౌన్ ఇష్యూపై స్పందించింది. ''ప్రపంచంతో పాటు, మన దేశాన్ని కుదిపేస్తున్న కరోనాను నియంత్రించడానికి ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణలో లాకౌట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయాలకతీతంగా సమర్ధించాల్సిన అవసరం ఉంది'' అని పేర్కొంటూ ట్వీట్ చేసింది.

    English summary
    Telangana CM KCR officially announced that State to be Lackdown till March 31st during corona effect. Now Anasuya Vijayashanthi reacted on this issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X