twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రాంబాబు’గొడవకు లగడపాటికి ఏం సంబంధం?

    By Srikanya
    |

    హైదరాబాద్ :''కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా గొడవకు లగడపాటికి ఏం సంబంధం? సినీ రంగంపై సాంస్కృతిక దండయాత్ర చేయక తప్పదు. రాంబాబు సినిమాను నిషేధించాలి. ఈ సినిమాలో తప్పులున్నాయని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం సమాచార శాఖ కమిషనర్ నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈ కమిటీలో నాతోపాటు డైరెక్టర్ శంకర్‌ను నియమించింది. కమిటీ నిర్వహించిన.. రాంబాబు సినిమా ప్రివ్యూ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం. సినీ రంగానికి చెందిన నాలుగు కుటుంబాలు హైదరాబాద్‌ను ఆక్రమించుకున్నాయి. ఉచితంగా భూములు, వసతులు కల్పిస్తే వాటిని అమ్ముకుంటూ, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారు. ' అని టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రశ్నించారు.

    ప్రజా ఉద్యమాలపైనా, సమాజంపైనా నిర్లక్ష్యపు దోరణితో ఉన్న దర్శకుడు, నటుడు కలిసి 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' సినిమాను తీసినట్లు కనపడుతోందని, ఈ సినిమాను బహిష్కరించాలని, మొత్తం సినిమాను రద్దు చేయాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్‌) నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 'రాంబాబు' సినిమా ఉద్యమాన్ని, ఉద్యమ నాయకత్వాన్ని అవమానించేలా ఉందన్నారు. ఇది దర్శకుడు, నటుడి పైత్యానికి, పైశాచికానందానికి నిదర్శనంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి సినిమాలు చూడవద్దని పిలుపునిచ్చారు.

    అలాగే ప్రభుత్వం సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేటపుడే చిత్రానికి అనుమతి నిరాకరించాల్సిందన్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్‌, డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌రాజు నివాసాలపై దాడి చేసినవారిపై పోలీసులు కేసులు పెట్టడం దారుణమని, వాస్తవానికి కేసులు పెట్టాల్సింది పూరీ జగన్నాథ్‌, దిల్‌రాజు వంటివారిపైనే అని అన్నారు. అరెస్టు చేసిన తెరాస విద్యార్థి విభాగం నేత సుమన్‌ తదితరులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 'రాంబాబు' సినిమాపై ధ్వజమెత్తిన దర్శకుడు శంకర్‌ తనకు బెదిరింపులు వస్తున్నాయని సమావేశంలో తెలపగా, వక్తలంతా ముక్తకంఠంతో ఖండించారు. తెలంగాణపై విషం చిమ్మిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రాన్ని రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అలాంటి దుర్మార్గపు, చెత్త సినిమాను ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు.

    కాజ్ ఆఫ్ క్రైమ్‌కు కారణమైన ఈ సినిమా డైరెక్టర్, నిర్మాత, హీరోలపై కేసులను నమోదు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. 'టీడీపీ కార్యకర్తలకు ఇజ్జత్ లేదు. చంద్రబాబును బొల్లి నేత అంటూ రాంబాబు సినిమాలో చిత్రీకరించినా కార్యకర్తలు పట్టించుకోవడం లేదు. ఇజ్జత్ ఉంటే ఆ సినిమా మీద పడిపోవాలా..' అని సమావేశం హితవుపలికింది. రాంబాబు సినిమాలో జర్నలిజాన్ని వక్రీకరించి చూపడాన్ని తీవ్రంగా ఖండించింది. ఆ సినిమాలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలను, వికలాంగులనూ వదలిపెట్టకుండా అవమానించారని సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా, సినిమా రంగాల్లో తెలంగాణవాదులను గిచ్చి, చిన్న బుచ్చుతున్నారని, గిల్లితే స్పందించకుండా ఉంటామా? అని ప్రశ్నించింది. బానిసత్వానికి ఒప్పుకునే సమస్యే లేదని పేర్కొంది. హైదరాబాద్‌ను సినీరంగం ఆక్రమించుకుందని ఆరోపించింది.

    English summary
    Congress Vijayawada MP Lagadapati Rajagopal has supported Pawan Kalyan starred Cameraman Gangatho Rambabu film. Telangana leadar condemned Lagadapati attitude and questioned him what is his relation with CGR film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X