అదుర్స్, లీడర్ చిత్రాలు కొనద్దంటూ హెచ్చరిక
అదుర్స్, లీడర్ సినిమాలను కూడా తెలంగాణలో నడవనీయబోమని తెలంగాణ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్ జాక్) పిలుపునిచ్చింది. అలాగే ఆంధ్రా ప్రాంతానికి చెందిన నటులు, నిర్మాతలు, దర్శకుల సినిమాలు తెలంగాణలో ఎవరూ కొనకూడదని పిలుపునిచ్చింది.ఒకవేళ ఎవరైనా కొని నష్టపోతే తమది బాధ్యత కాదని పేర్కొంది. వాళ్ల సినిమాలు ఇక్కడ నడవాలంటే సినిమా ఇండస్ట్రీ అంతా తెలంగాణకు మద్దతిస్తూ బహిరంగంగా మీడియా సమావేశంలో పెట్టి ప్రకటించాలని టీఎస్‌జాక్ షరతు పెట్టింది.
తెలంగాణ రాకుండా ఢిల్లీలో ఆంధ్రా లాబీయింగ్ జరుగుతోందని, దానిలో సినీ పరిశ్రమకు చెందినవారు కూడా పాలుపంచుకుంటున్నారని టీఎస్‌జాక్ ఆరోపించింది. అలాగే ఆ ఆంధ్రా సినిమాలు కొనొద్దని తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లను టీఎస్‌జాక్ హెచ్చరించింది. నటులు, కళాకారులు తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ప్రకటించే వరకు ఆంధ్రా వారి సినిమాలను తెలంగాణలో ఆడనివ్వకూడదని ఆర్య 2 సినిమాను మలివిడత విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణలో ఈ సినిమాను ఆడనివ్వబోమంది. అలాగే ఆంధ్రా వ్యాపారుల వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.


Click it and Unblock the Notifications











