twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాడిని రోడ్డు మీద రాళ్ళతో కొట్టి చంపాలి.. కవిత

    సినీ దర్శకులు రోజుకో మహిళను మారుస్తారని బీజేపీ ఎంపీ చింతామణి మాలవీయ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమయ్యాయి.

    By Rajababu
    |

    Recommended Video

    వాడిని రోడ్డు మీద నిలబెట్టి రాళ్ళతో కొట్టి చంపాలి...!

    సినీ దర్శకులు రోజుకో మహిళను మారుస్తారని బీజేపీ ఎంపీ చింతామణి మాలవీయ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమయ్యాయి. మాలవీయ వ్యాఖ్యలను పలువరు సినీ ప్రముఖులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు రామకృష్ణగౌడ్, కవిత హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాలవీయపై నిప్పులు చెరిగారు.

    ఎంపీ మాలవీయకు అక్కలు లేరా?.

    ఎంపీ మాలవీయకు అక్కలు లేరా?.

    నటి, తెలంగాణా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ కవిత మాట్లాడుతూ.. ఎంపీ చింతామణి మాలవీయ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అతనికి ఇంట్లో తల్లి చెల్లి, అక్క, ఆడవాళ్ళూ లేరా అని ప్రశ్నించారు.

    ఎంపీ అనుచిత వ్యాఖ్యలు

    ఎంపీ అనుచిత వ్యాఖ్యలు

    ప్రధాని మోదీ ఆడవాళ్లకు గౌరవమిస్తారు. అదే పార్టీకి చెందిన ఎంపీ మాలవీయ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండించ దగిన విషయం. సినిమా వాళ్ళు అంటే చులకనగా చూడటం తప్పు అని కవిత అన్నారు.

    ఎందుకింత అనాగరికం

    ఎందుకింత అనాగరికం

    ఓ డాక్టర్ తప్పు చేస్తే అందర్నీ అనరు. మీడియాలో ఒకరు తప్పు చేస్తే అందరినీ తప్పుపట్టరు. కానీ సినిమా వాళ్ళు ఒక్కరు తప్పు చేసిన అందర్నీ అంటారు. ఎందుకింత అనాగరికంగా మాట్లాడతారు.

    కవిత వాడితో తిరుగుతుందంటారు.

    కవిత వాడితో తిరుగుతుందంటారు.

    అదే మా పక్కింట్లో ఆడవాళ్ళూ.. వాళ్ళు ఒక అబ్బాయితో బయటకెళ్తే అన్నతోనో తమ్ముడితోనో వెళ్ళింది అంటారు. అదే నేను నా అన్నతో బయటకెళ్తే కవిత ఒక అబ్బాయితో వెళ్ళింది అంటూ తప్పుగా మాట్లాడతారు. అదే మా పక్కింటావిడ పెద్దవాళ్ళతో బయటకెళ్తే నాన్నతోనో ఇంకెవరితోనో వెళ్ళింది అంటారు. కానీ అదే నేను మా నాన్నతో బయటకెళ్తే కవిత ఒక ముసలి వాడితో తిరుగుతుంది అంటారు.

    ఎంపీని రాళ్లతో కొట్టాలి

    ఎంపీని రాళ్లతో కొట్టాలి

    ఏంటండీ.. ఇది ? ఎందుకిలా మాట్లాడతారు మేం సినిమావాళ్ళం.. మేం కొన్ని వందలమందిలో వుంటాం.. మా పక్కన ఎవరుంటారో ఏం తెలుస్తుంది..? ఈ సినిమా గురించి వీడికి ఏం తెలుసు ఇలాంటి మాటలు మాట్లాడే వాణ్ని రోడ్డు మిద నిలబెట్టి రాళ్ళతో కొట్టి చంపాలి. ఈ విషయాన్నీ మేం వదిలిపెట్టం మేం నేషనల్ మీడియాకి వెళ్తాం. మోదీతో కూడా మాట్లాడతాం..ఏంపీ చింతామణి మాలవీయ తన పదవికి రాజీనామా చెయ్యాలి.. ఇలాంటి వాళ్ళు అనర్హులు అంటూ విరుచుకుపడ్డారు.

    English summary
    Telangana Maa Association President Fires On MP Chintamani Malya..She demanded to resign his Job.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X