కులాన్ని అవమానించారు: తెలంగాణలో ‘బాహుబలి’ అడ్డుకుంటాం
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' సినిమా ఈ నెల 10న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై తాజాగా ఓ వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో మాల కులస్తులను అవమాన పరిచే సన్నివేశాలు, మాటలు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని తెలంగాణ మాలల జేఏసీ చైర్మన్ బి.దీపక్ కుమార్ డిమాండ్ చేసారు.
సినిమాలో ఆ సీన్లను వెంటనే తొలగించక పోతే తెలంగాణలో ఆ సినిమాను అడ్డుకుంటామని దీపక్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు మాలలను కించపరుస్తూ ప్రసారమైన వీడియో క్లిప్పింగులను యూట్యూబ్ ద్వారా సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దీపక్ కుమార్ తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్య కృష్ణ, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్ 1 ‘బాహుబలి-ది బిగినింగ్' జులై 10న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నట్లే.... అందుకు తగిన విధంగానే సినిమా విడుదలకు ముందే ఈ సినిమా భారీగా బిజిజనెస్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ లో టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.


Click it and Unblock the Notifications











