ప్రభాస్‌కు థాంక్స్ చెప్పిన తెలంగాణ మంత్రి కేటీఆర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ థాంక్స్ చెప్పారు. కొంప తీసి ఇది 'సాహో' సినిమా గురించిన విషయం అని మాత్రం అనుకోవద్దు. కేటీఆర్ చేసిన ఒక మంచి ప్రయత్నాన్ని ప్రభాస్ తన సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేశారు. దీంతో ఫిదా అయిన కేటీఆర్ వెంటనే రియాక్ట్ అయ్యారు.

వైరల్ జ్వరాలు, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధుల నివారణకు ఆయా ప్రాంతాల్లో మున్సిపాలిటీ సిబ్బంది దోమల నివారణకు, పరిశుభత్రకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు.

మీ ఇంటి పరిసరాలను పరిశీలించండి, నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోండి. పూల కుండీలు, ఎయిర్ కూలర్లు, ఇతర నీరు నిలిచే వస్తువులను తనీఖీ చేయాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేటీఆర్ తన సొంత ఇంటి పరిసరాలను పరిశీలించి దోమల మందు చల్లారు. ప్రతి ఒక్కరూ ఇలాగే చేయాలని కోరుతూ ట్వీట్ చేశారు.

Telangana Minister KTR thanks to actor Prabhas

కేటీఆర్ చేసిన ఈ ట్వీటును ప్రభాస్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా షేర్ చేసి ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నం చేశారు. యంగ్ రెబల్ స్టార్ చేసిన ఈ పనిపై థాంక్స్ చెబుతూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ప్రభాస్ అభిమానులు కూడా కేటీఆర్ చేసిన ఈ ట్వీటును షేర్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X