India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యూట్యూబర్‌ ప్రాణం తీసిన మద్యం.. కొబ్బరి బొండాలలో కలుపుకుని మరీ పబ్బుకు.. హార్ట్ బ్రేకయిందన్న షన్ను

  |

  ప్రముఖ యూట్యూబర్‌, సినిమా జూనియర్​ ఆర్టిస్ట్​ గాయత్రి.. శుక్రవారం రాత్రి గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్నా సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు హోలీ వేడుకల్లో పాల్గొన్న అనంతరం స్నేహితుడు రోహిత్​తో కలిసి సైబరాబాద్​లోని విప్రో జంక్షన్‌ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా అధిక వేగం కారణంగా కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పై బోల్తా పడింది. ఈ ఘటనలో గాయత్రి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. రోహిత్​కు కూడా తీవ్ర గాయాలయ్యాయని ప్ర‌స్తుతం రోహిత్ చికిత్స పొందుతున్నాడుని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి కారణం మద్యం మత్తులో వేగంగా కారు నడపడమే అని తేల్చారు పోలీసులు. ఆ వివరాల్లోకి వెళితే

  ఏఐజీ ఆస్పత్రికి

  ఏఐజీ ఆస్పత్రికి

  హోలీ సందర్భంగా గాయత్రి తన స్నేహితుడు రోహిత్‌తో కలిసి పబ్‌కు వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా గ‌చ్చిబౌలి వ‌ద్ద కారు అదుపుత‌ప్పి పుట్‌పాత్‌ను ఢీకొట్టింది. అనంత‌రం ఆ ప‌క్క‌నే గార్డెనింగ్ ప‌నులు చేస్తున్న మ‌హిళ‌ను ఢీకొట్టడంతో ఆ మ‌హిళ అక్క‌డికక్క‌డే మృతి చెందింది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయ‌ప‌డిన రోహిత్ తో పాటు గాయ‌త్రిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.

  మద్యం తాగి జల్సా

  మద్యం తాగి జల్సా


  అయితే.. గాయత్రి అప్ప‌టికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్ర‌స్తుతం రోహిత్ చికిత్స పొందుతున్నా అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో కారును గాయ‌త్రి డ్రైవ్ చేయ‌గా.. అతి వేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని భావించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టగా మద్యం మత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్టు తేల్చారు. ప్రమాదానికి ముందు.. రోహిత్​, అతని స్నేహితులు ఫుల్లుగా మద్యం తాగి జల్సా చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

  అక్కడే సందడిగా

  అక్కడే సందడిగా


  హోలీ వేళ ఇలాంటివి జరుగుతాయని భావించి ముందే మద్యం అమ్మకాలు నిలిపివేయడంతో... స్నేహితులతో కలిసి రోహిత్‌ మద్యాన్ని ముందే కొనుగోలు చేశాడు. వాటిని అనుమానం రాకుండా.. 8 కొబ్బరి బొండాలలో కలిపాడు. హొలీ రోజున గాయత్రి, మరో ఐదుగురు రోహిత్ స్నేహితుడి గదిలో పార్టీ చేసుకున్నారు. పార్టీ అనంతరం అందరూ కలిసి మద్యం కలిపిన కొబ్బరి బొండాలు తీసుకుని.. కారులో పెట్టుకుని ప్రిజమ్ పబ్​కు వెళ్లారు. స్నేహితులు అంతా కలిసి అక్కడే సందడిగా గడిపారు.

  ల్యాబ్‌కు పంపించి

  ల్యాబ్‌కు పంపించి


  ఆ తర్వాత వేడుకల నుంచి కారు వద్దకు వచ్చి కొబ్బరి బొండాలలో ఉన్న మద్యం సేవించారు. 8 కొబ్బరిబొండాలు ఉండగా అందులో ఆరింటిని తాగారు. కారులో రెండు కొబ్బరిబొండాలు ఉంచుకుని.. వెళ్తుండగా.. మద్యం మత్తులో గాయత్రి డివైడర్‌ను ఢీకొట్టింది. పోలీసులు.. కారులో ఉన్న మద్యం కలిపిన కొబ్బరి బొండాలను గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల కోసం వీటిని.. ల్యాబ్‌కు పంపించారు.

  హార్ట్ బ్రేక్

  హార్ట్ బ్రేక్


  ఇక ఆమె మరణ వార్త విని పలువురు సినీ నటులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో గాయత్రితో ఉన్న ఓ ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది. 'ఇది చాలా అన్యాయం.. నమ్మడానికి కష్టంగా ఉంది. నీతో నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అసలు మాటలు రావడం లేదు' అంటూ భావోద్వేగానికి లోనైంది. షణ్ముఖ్ సైతం గాయత్రి తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. హార్ట్ బ్రేక్ సింబల్ ను పోస్ట్ చేశాడు

  English summary
  Telangana Police found that Dolly Gayathri committed accident under alcohol
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X