Dimple Hayathi: డింపుల్ హాయతిపై కేసు నమోదు..ఆ పని చూస్తూ అడ్డంగా దొరికిపోయిన వైనం
హీరోయిన్ డింపుల్ హాయతి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.పార్కింగ్‌లో ఉన్న కారును ధ్వంసం చేశారని భాదితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్ హాయతిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
డింపుల్ హాయతి జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్ అపార్ట్మెంట్‌లో డేవిడ్ అనే వ్యక్తితో నివాసం ఉంటోంది. త్వరలోనే డేవిడ్‌ను డింపుల్ హయతి వివాహం చేసుకోబోతున్నారనే విషయం మీడియాలో ప్రచారం అవుతున్నది. ఇదే అపార్ట్మెంట్‌లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కూడా నివాసం ఉంటున్నారు. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేకు వాహనాన్ని డేవిడ్‌తో కలిసి డ్యామేజ్ చేసేందుకు డింపుల్ హయతి ప్రయత్నం చేశారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రతిరోజు డిసిపి వాహనానికి ఉన్న కవర్ ను తొలగించడం, వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్ లను కాలితో తన్నడం వంటి పనులు చేస్తున్నారు. డింపుల్ హాయతి ఇక్కడితో ఆగకుండా తన వాహనంతో డిసిపి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పార్కింగ్ చేసి ఉన్న డిసిపి కారు ముందు భాగం డ్యామేజీ అయింది.
సిసి టీవీ ఫుటేజ్ ద్వారా డింపుల్ హాయతినే ఈ ఘటనకు పాల్పడిందని గుర్తించిన డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిసి టీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డింపుల్ హాయతి డేవిడ్లను పోలీస్ స్టేషన్‌కు పిలిచి 41కింద నోటీసులు ఇచ్చారని సమాచారం.ఇక డింపుల్ హాయతి కెరీర్ విషయానికి వస్తే..ఇటీవల హీరో హీరో గోపిచంద్ నటించిన రామబాణం సినిమా ఆమె నిరాశనే మిగిల్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది.గతంలో రవితేజతో నటించిన ఖిలాడీ కూడా ఫెయిల్ కాయింది. ఇటువంటి తరుణంలో డింపుల్ హాయతి ఇలా వివాదాల్లో చిక్కుకోవడం.. ఆమె కెరీర్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది.
అయితే తనపై కేసు నమోదు కావడంపై డింపుల్ హయతి నర్మగర్భంగా ట్వీట్ చేసింది. అధికారం ఉందని తప్పు ఒప్పు చేయలేరనే విధంగా కామెంట్ చేయడం ఆసక్తిని రేపింది. డింపుల్ హయతి చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











