twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అజ్ఞాతవాసి'కి తెలంగాణ ఖాకీ దెబ్బ: ప్రీమియర్లకు 'నో'.. ఊహించని షాక్‌?

    |

    Recommended Video

    ప్రీమియర్లకు 'నో'.. 'అజ్ఞాతవాసి'కి ఊహించని షాక్‌ !

    అనుమతులన్నీ వచ్చేశాయి ఇక విడుదలే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో 'అజ్ఞాతవాసి'కి తెలంగాణ రాష్ట్ర పోలీసులు పెద్ద షాక్ ఇచ్చారు. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందన్న కారణంతో 'అజ్ఞాతవాసి' ప్రీమియర్ 'షో'లకు అనుమతి నిరాకరించారు. దీంతో 'అజ్ఞాతవాసి' నిర్మాతలు ఆందోళనలో పడ్డారు. ఏపీ ప్రభుత్వం అర్థరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 10 గంటల మధ్య ప్రత్యేక 'షో'లు వేసేందుకు అనుమతినివ్వడంతో ఇక్కడ కూడా అనుమతులు వస్తాయనే భావించారు. కానీ చివరి నిమిషంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

    కేసీఆర్‌ సాబ్.. 'అజ్ఞాతవాసి' చూపిస్తాం రండి, స్పెషల్ 'షో': మరీ మరీ అడిగిన త్రివిక్రమ్!కేసీఆర్‌ సాబ్.. 'అజ్ఞాతవాసి' చూపిస్తాం రండి, స్పెషల్ 'షో': మరీ మరీ అడిగిన త్రివిక్రమ్!

     ఈ థియేటర్లలో ప్రీమియర్లు రద్దు..:

    ఈ థియేటర్లలో ప్రీమియర్లు రద్దు..:

    అర్థరాత్రి తర్వాత ప్రీమియర్ 'షో'లకు తెలంగాణ పోలీసులు అనుమతినివ్వలేదు. దీంతో మల్లిఖార్జున, భ్రమరాంబ, ఆర్కే థియేటర్లలో అర్థరాత్రి తర్వాత ప్రీమియర్ 'షో'లు రద్దయ్యాయి. పోలీసులు అనుమతి నిరాకరించటంతో రేపు ఉదయం 8గం.కు తొలి షో పడనుంది. ప్రీమియర్ 'షో'ల కోసం చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నవేళ.. అనుమతుల నిరాకరణ పెద్ద షాక్ అనే చెప్పాలి.

     పవన్-కేసీఆర్ భేటీపై దుమ్మెత్తిపోశారు:

    పవన్-కేసీఆర్ భేటీపై దుమ్మెత్తిపోశారు:

    'అజ్ఞాతవాసి' బెనిఫిట్, ప్రీమియర్ 'షో'ల అనుమతి కోసమే ఇటీవల పవన్ కల్యాణ్ స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ భేటీతో రాజకీయంగా ఇద్దరిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అవసరం కోసం ఎంతకైనా దిగజారే నేతలంటూ చాలామంది దుమ్మెత్తిపోశారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం దీనికి తనవంతు ఆజ్యం పోశారు.

     బొమ్మ పడటమే ఆలస్యం అనుకున్నారు..:

    బొమ్మ పడటమే ఆలస్యం అనుకున్నారు..:

    మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత చినబాబు కూడా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ప్రత్యేకంగా కలిశారు. అనుమతులు ఇప్పించినందుకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు.. స్పెషల్ 'షో' ఏర్పాటు చేస్తామని రమ్మని ఆహ్వానించారు. మంత్రితో పాటు సీఎం కేసీఆర్‌ను కూడా రావాలని కోరారు. అంతా సెట్ అయిందని, ఇక థియేటర్లలో బొమ్మ పడటమే ఆలస్యం అని అనుకున్నారు.

     ఓపెనింగ్స్‌కు పెద్ద దెబ్బ:

    ఓపెనింగ్స్‌కు పెద్ద దెబ్బ:

    భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమా కావడంతో.. ఓపెనింగ్స్ రూపంలో వీలైనంత ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాలని 'అజ్ఞాతవాసి' నిర్మాతలు భావించారు. అందుకే తొంభై శాతం థియేటర్లలో సినిమా విడుదలకు ప్లాన్ చేశారు. దానికి తోడు ప్రీమియర్, బెనిఫిట్ 'షో'లు కలిసొస్తాయనుకున్నారు. కానీ తెలంగాణ పోలీస్ ప్రీమియర్ 'షో'లను రద్దు చేయడంతో ఓపెనింగ్స్‌కు పెద్ద దెబ్బే పడింది.

     ఏపీలో అన్ని అనుమతులు..

    ఏపీలో అన్ని అనుమతులు..

    ఇక ఏపీ విషయానికొస్తే.. అక్కడ బేషరతుగా అనుమతులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఎన్ని 'షో'లు అయిన వేసుకోమని జీవో కూడా విడుదల చేసింది. దీంతో ఏపీలో కలెక్షన్లకు ఢోకా ఉండదనే చెప్పాలి. నిజానికి నైజాం మార్కెట్ పెద్దది కావడంతో.. హైదరాబాద్ లో ప్రీమియర్లకు అనుమతిస్తే కలెక్షన్లు మరింత పెరిగేవనేది నిర్మాతల భావన.

    English summary
    Powerstar Pawan Kalyan's next film Agnyaathavaasi team is in busy planning to release for his film. At this moment Telangana police rejected permission for premier shows
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X