Allu Arjun Case: అల్లు అర్జున్ కేసులో ఊహించని పరిమాణం.. పోలీసుల సంచలన నిర్ణయం..
Allu Arjun: సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ మద్యంతర బెయిల్ పై బయటికి వచ్చారు. ఈ తరుణంలో సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి బన్నీని పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు మరో షాక్ ఇచ్చేలా పోలీసులు పావులు కదులుతున్నట్టు , ఈ కేసులో పోలీసులు ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇంతకీ ఏం జరిగిందంటే ?
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన రేవతి(35) అనే వివాహిత మృతి చెందింది, ఆమె కుమారుడు శ్రీతేజ్ (13) అపస్మారక స్థితికి చేరుకొని చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతోపాటు, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం వల్లనే ఈ ఘటన జరిగిందని పోలీసులు భావించారు.

ఈ ఘటనలో అల్లు అర్జున్ ను పై కేసు నమోదు చేశారు. దీంతో శుక్రవారం నాడు బంజారా హిల్స్ లోని తన నివాసంలో అల్లు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిమిత్తం గాంధీకి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం భారీ బందోబస్తు నడుమ నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో హీరో వర్గాల వాదనలు విన్న కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పును వెల్లరించింది. దీంతో చంచల్ గూడ తరలించారు.
దీంతో అల్లు అర్జున్ లాయరు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. అయితే బెయిల్ ఆర్డర్స్ ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ ను శనివారం ఉదయం 6:40 నిమిషాలకు విడుదల చేశారు. ఇలా శనివారం రాత్రి మొత్తం అల్లు అర్జున్ జైల్లోనే గడపాల్సి వచ్చింది. జైలు నుండి విడుదలై వచ్చిన అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నుండి పలువురు సెలబ్రిటీలు నటులు రాజకీయ ప్రముఖులు బన్నీని పరామర్శించారు.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. తాజా పరిణామాలను చూస్తే అల్లు అర్జున్ కు ఊహించని రీతిలో చెక్కుపెట్టాలని హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ తప్పేమీ లేదని, పోలీసుల నిర్లక్ష్యం వల్లనే తొక్కిసలాట జరిగిందని పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ఈ తరుణంలో అసలు సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ వస్తారని ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ టీం గాని, సంధ్య థియేటర్ యజమాన్యం గాని తమకు ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు ఇదే రిపోర్టు ను ఆధారంగా చేసుకొని పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించి అల్లు అర్జున్ కు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని కోరబోతున్నట్లు తెలుస్తుంది దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే గనక జరిగితే అల్లు అర్జున్ ఊహించని కష్టాలలో పడతాడని చెప్పాలి. మరీ అల్లు అర్జున్ నెక్స్ట్ ఎలాంటి స్టెప్ వేస్తారనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











