For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫిల్మ్ చాంబర్... ఆంధ్రా, తెలంగాణ విభజన వివాదం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఏపీ, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ల వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సపరేట్ ఫిల్మ్ చాంబర్ ఉండాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు డిమాండ్ చేస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్‌'ను అదే పేరుతో కొనసాగించాలని...దాన్ని ‘తెలుగు ఫిల్మ్ చాంబర్'గా పేరు మార్చడానికి తాము ఒప్పుకోమని తెలంగాణ సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సానా యాదిరెడ్డి తెలిపారు.

    మంగళవారం ఛాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సానా యాదిరెడ్డి మాట్లాడుతూ...‘గతంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌లో ఏపీ ఫిలిం ఛాంబర్ పేరును తెలుగు ఫిలిం ఛాంబర్‌గా మార్చటానికి చేసిన ప్రయత్నాల్ని మేము తీవ్రంగా వ్యతిరేకించాం. దీంతో ఫిలిం ఛాంబర్‌ను రెండుగా విభజించడానికి ఇరు ప్రాంతాల నుంచి ఐదుగురు సభ్యులతో కమిటీ వేసి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని హామీ ఇచ్చారు. అంతవరకు ఛాంబర్ ఎన్నికల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. తర్వాత తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఏర్పాటుకు సి.కల్యాణ్ అంగీకరించడమే కాకుండా సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ నుంచి తెలంగాణ ఫిలిం ఛాంబర్‌కు గుర్తింపు తెస్తానని హామీ ఇచ్చారు' అని తెలిపారు.

    Telangana producers protest to change AP film chambers name

    కానీ...ఇప్పుడు మళ్లీ ఛాంబర్ పేరు మార్పును ముందుకు తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మా అసోసియేషన్ వ్యతిరేకిస్తోంది. విజయవాడలో ఛాంబర్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి తెలుగు ఫిలిం ఛాంబర్‌గా పేరు మార్చాలనుకోవడం ఇరువైపులా వున్న సామరస్య వాతావరణాన్ని దెబ్బతీయటంగానే మేము భావిస్తున్నాం. ఈ వ్యవహారాన్ని తెలంగాణ అస్తిత్వంపై దాడిగానే పరిగణిస్తున్నామన్నారు యాదిరెడ్డి.

    ఏపీ ఫిలిం ఛాంబర్‌ను తెలుగు ఫిలిం ఛాంబర్‌గా మార్చకుండా యధావిధిగా కొనసాగించాలని కోరుతున్నాం. ఏపీ ఫిలిం ఛాంబర్ పేరును తెలుగు ఫిలిం ఛాంబర్‌గా మార్చే కుట్రలకు తెరదించాల్సిందిగా కోరుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు జి.శంకర్‌గౌడ్, యస్. దశరథ్, ప్రధాన కార్యదర్శి సంగకుమార్, సంయుక్త కార్యదర్శి పులి అమృత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Telangana producers protest to change AP film chambers name.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X