ప్రముఖ నటి తెలంగాణ శకుంతల కన్నుమూత
హైదరాబాద్: సినీ నటి తెలంగాణ శకుంతల(65) శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంపల్లిలోని తన స్వగృహంలో శకుంతల గుండెపోటుకు గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని నారాయణ హృదయాలయా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
1981లో వచ్చిన 'మాభూమి' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన ఆమె తెలంగాణ యాసతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శంకుతల నటించిన చివరి సినిమా పాండవులు పాండవులు తుమ్మెదా. 70కి పైగా సినిమాల్లో నటించిన శకుంతల క్యారెక్టర్ నటి, హాస్య నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
శంకుతల స్వస్థలం మహారాష్ట్ర. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శంకుతల మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు అల్వాల్ స్మశానవాటికలో శకుంతల అంత్యక్రియలు జరగనున్నాయి.



Click it and Unblock the Notifications











