pushpa 2 tickets: టికెట్ ధరల పెంపు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ లో పుష్ప 2 టిక్కెట్ల రేట్లు ఎంత పెరిగాయంటే?
Pushpa 2 Ticket Rates: అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. పాన్ ఇండియా లెవెల్ లో రూపుదిద్దుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ విడుదల దగ్గర పడుతున్న కొద్ది.. సినిమాపై హైప్స్ పెంచేలా కొత్త అప్డేట్స్ వస్తునే ఉన్నాయి. తాజాగా పుష్ప 2 మూవీ టికెట్ల ధరలపై పెంపుపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఆ నిర్ణయంపై తెలంగాణా ప్రభుత్వం సానూకూల నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ లో పుష్ప 2 టిక్కెట్ల రేట్లు ఎంత పెరిగాయంటే?
మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2' లో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన మరోసారి భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో రెచ్చిపోబోతున్నారు. ఇక సునీల్, అనసూయ భరద్వాజ్, డాలీ ధనుంజయ, అజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ కంపోజ్ చేశారు. డీఎస్పీతో పాటు తమన్ నేపథ్య సంగీతం అందించారు. ఈ సినిమాకు డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా.. మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ లు నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంతే కాకుండా బెనిఫిట్ షోలు వేసుకోవడం కోసం కూడా అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉతర్వుల ప్రకారం.. డిసెంబర్ 4న 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలతో పాటు అర్ధరాత్రి ఒంటి గంట షోకు అనుమతి ఇచ్చింది. ఈ సినిమాకి టికెట్ రేట్లు భారీగా పెరుగుతాయని ముందు నుంచే ఊహించారు. మూవీ మేకర్స్ ప్రతిపాదనలకు తెలంగాణ సర్కార్ సానుకూలంగా స్పందించింది.
మూవీ టీమ్ టికెట్ రేట్ల పెంపు, అదనపు షోల కోసం ప్రభుత్వాన్ని సంప్రదించగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ జీవో విడుదల చేసింది. పుష్ప2 బెనిఫిట్ షోల టికెట్ ధరలు భారీగా పెంచుకునే అవకాశం కల్పించింది. సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌ల్లో బెటిఫిట్ షోలకు టికెట్ ధరలు రూ.800 గా ఖరారు చేసింది. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు పర్మిషన్ ఇచ్చింది. ఇలా పుష్ప 2 బెనిఫిట్ షోల టికెట్ ధర రూ.800 వరకు పెంచుకునే అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.

మొదటి నాలుగు రోజులు అంటే.. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ. 150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 వరకు పెంచుకోవడానికి
పర్మిషన్ ఇచ్చింది. ఆ తరువాత డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చింది. ఇక డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 23 వరకు సింగల్ స్క్రీన్ టికెట్ ధరలపై రూ.20, మల్టీఫ్లెక్స్ టికెట్ ధరలపై రూ.50 పెంపునకు అనుమతి ఇచ్చింది టీ సర్కార్.
పుష్ప 1 కు సిక్వెల్ గా వస్తున్న పుష్ప 2 ని భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఈ మూవీ కోసం దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. రిలీజ్ ముందుగానే 1000 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బన్నీకి 300 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు టాక్. డిసెంబర్ 5 విడుదల కాబోతున్న పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు సాధిస్తోందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











