రవితేజ ‘నిప్పు’కు తెలంగాణ సెగ
టాలీవుడ్ హీరో రవితేజను సైతం తెలంగాణవాదులు వదల్లేదు. జై తెలంగాణ నినాదాలతో ఆయన నటిస్తున్న నిప్పు సినిమాను మంగళవారం అడ్డుకున్నారు. హీరో రవితేజను చుట్టుముట్టిన ఆందోళనకారులు తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేయాలని ఆయన్ను డిమాండ్ చేశారు. ఈ హఠాత్పరిణామంతో ఖంగుతిన్న రవితేజ....ఏం చేయాలో అర్థం కాక వాళ్ల డిమాండుకు తలూపి అక్కడి నుంచి వెళ్లి పోయినట్లు తెలుస్తోంది. తెలంగాణవాదుల దాడితో నిప్పు షూటింగ్ ఆగిపోయింది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం సద్దుపల్లిలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
రవితేజ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వైవియస్.చౌదరి నిర్మిస్తున్న చిత్రం 'నిప్పు'. ఇందులో రవితేజ సరసన దీక్షాసేథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో జరుగుతోంది. తెలంగాణ సెగతో షూటింగును వేరే చోటుకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











