చైతూ- శోభితలపై నోటి దురుసు.. వేణుస్వామికి బిగుసుకుంటోన్న ఉచ్చు!

సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రజంట్ ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు. తనకు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టడం , కోరి సమస్యలు తెచ్చుకోవడం ఆయనకు నిత్యకృత్యమైంది. ప్రభాస్ అభిమానులు, టీడీపీ, జనసేన కేడర్ సహా చాలా మంది సెలబ్రిటీల ఫ్యాన్స్‌‌కు వేణుస్వామి టార్గెట్ అయ్యారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు మద్ధతు పలకకపోగా.. తిరిగి నాలుగు మాటలు అంటున్నారు. అలా వేణుస్వామి టైం అస్సలు బాలేదు.

సమంతతో విడాకుల ఒంటరిగా ఉంటూ తన సినిమాలు తాను చేసుకుంటున్న నాగచైతన్య రెండ్రోజుల క్రితం తన సహ నటి శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. దీనికి ముందు రోజు నుంచే సోషల్ మీడియాలో వీరి నిశ్చితార్ధంపై వార్తలు వస్తుండగా.. కింగ్ నాగార్జున అఫీషియల్‌గా అనౌన్స్ చేసి పుకార్లకు తెరదించారు. ఏది ఏమైతేనేం తమ హీరో తిరిగి వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండటంతో అక్కినేని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు, నెటిజన్లు సైతం ఈ జంటకు విషెస్ తెలియజేస్తున్నారు.

telangana women commission issued notice to astrologer venu swamy over his comments on Akkineni naga chaitanya and sobhita dhulipala horoscope

అయితే ట్రోలింగ్ దెబ్బకు సెలబ్రెటీలకు జోతిష్యం చెప్పనని అప్పుడెప్పుడో వేణుస్వామి చెప్పారు. కానీ ఆ మాటల్ని తుంగలో తొక్కి చైతూ- శోభిత మ్యాటర్‌లో ఎంటరయ్యారు. వీరిద్దరి జాతకం కలవలేదని, నిశ్చితార్ధం జరిగిన సమయం కరెక్ట్ కాదని .. ఒక అమ్మాయి కారణంగా ఈ జంట 2027లో విడిపోతారని ఓ స్టేట్‌మెంట్ వదిలాడు. ఆ మాటలతో అక్కినేని ఫ్యాన్స్‌కి ఎక్కడో కాలింది.. శుభమా అని నిశ్చితార్ధం చేసుకుని గంటలు గడవకముందే ఆ మాటలేంటీ , నిన్ను ఎవరు జాతకం చెప్పామన్నారంటూ వేణుస్వామిపై ట్రోలింగ్‌కు దిగారు.

అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో వేణుస్వామి దిగొచ్చారు. గతంలో సమంత - నాగచైతన్య జాతకాన్ని చెప్పానని.. దానికి కొనసాగింపుగా తాజా నిశ్చితార్ధాన్ని విశ్లేషించానని వివరణ ఇచ్చాడు. సెలబ్రిటీల జాతకం చెప్పడం మానేశానని, ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉంటానని, రాజకీయాలపైనా మాట్లాడనని వేణుస్వామి స్పష్టం చేశారు. మా అధ్యక్షుడు మంచు విష్ణుకు కూడా ఇదే అంశంపై వివరణ ఇచ్చానని వెల్లడించారు.

telangana women commission issued notice to astrologer venu swamy over his comments on Akkineni naga chaitanya and sobhita dhulipala horoscope

కానీ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎఫ్‌జేఏ), తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ (టీఎఫ్‌డీఎంఏ)లు మాత్రం వేణుస్వామి జోస్యాన్ని సీరియస్‌గా తీసుకుని తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేశాయి. దీనిపై తాజాగా కమీషన్ ఛైర్‌పర్సన్ నేరేళ్ల శారద స్పందించారు. ఆగస్ట్ 22న తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా వేణుస్వామికి నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారం సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై వేణుస్వామి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X