మహేష్ దూకుడును అడ్డుకున్న తెలంగాణవాదులు
హైదరాబాద్: ప్రిన్స్ మహేష్ బాబు చిత్రం దూకుడును తెలంగాణవాదులు ఆదివారం అడ్డుకున్నారు. దీంతో చిత్రం యూనిట్ షూటింగును వాయిదా వేసింది. ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లాలోని వికారాబాదులో దూకుడు చిత్రం షూటింగు కోసం యూనిట్ అక్కడకు చేరుకుంది. హీరో మహేష్ బాబు సైతం ఈ చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఈ షూటింగ్ వికారాబాద్ రైల్వే స్టేషన్లో ప్రారంభమవుతుండగా పలువురు తెలంగాణవాదులు అక్కడకు చేరుకొని జైతెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
ఆంధ్రా హీరోల చిత్రాల షూటింగులను ఇక్కడ జరగనిచ్చేది లేదని హెచ్చరించారు. సెట్స్‌లో ఉన్న హీరో మహేష్ బాబు బయటకు రాలేదు. చిత్రీకరణ జరుగుతుండగా ఉన్న పోలీసులు తెలంగాణవాదులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో యూనిట్ సభ్యులు షూటింగును నిలిపి వేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో పోలీసులు సైతం షూటింగు నిలిపి వేయాల్సిందిగా యూనిట్‌ను కోరారు.


Click it and Unblock the Notifications











