తెలంగాణ వీరవణిత‘చాకలి ఐలమ్మ’జీవితంపై సినిమా
తెలంగాణ అంశంతో ఇప్పటికే పలు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. తాజా తెలంగాణ ఉద్యమ నేపథ్యం, చరిత్రను ఆధారంగా చేసుకుని మరో సినిమా తెరకెక్క బోతోంది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ పోరాటంలో ముందుండి సమరశంఖం పూరించిన తొలి తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ. ఆమె యదార్థ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'చాకలి ఐలమ్మ". వరంగల్ టాకీస్ పతాకంపై కె. నాగమణి, గుర్రపు విజయ్‌కుమార్ నిర్మిస్తున్నారు. మిరియాల రవీందర్ దర్శకుడు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్షికమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ నెల 26 నుంచి ఖమ్మం, మణుగూరు ప్రాంతాల్లో షూటింగ్ తొలి షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ ' ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక తెలంగాణ పోరులో తెలంగాణ రాదన్న బాధతో ఎంతో మంది ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి వారందరికి ఆత్మహత్యలతో తెలంగాణను సాధించుకోలేమని ఈ చిత్రం ద్వారా తెలిపే ప్రయత్నం చేసున్నాం. తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరోచితమైన పోరాటపటిమను ప్రదర్శించిన చరిత్ర మనది. అందుకే చాకలి ఐలమ్మ పోరాటపటిమను అందరికీ తెలియజేయడం కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం" అన్నారు.
చాకలి ఐల్మమ్మ పాత్ర దారి ప్రీతీ నిగమ్ మాట్లాడుతూ ' తెలంగాణ చరిత్రలో వీరనారిగా నిలిచిపోయిన చాకలి ఐలమ్మ పాత్రలో నేను నటిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నాను" అన్నారు. ప్రీతీ నిగమ్, రాఖీ, బండారి మువ్వ, రమేష్, బయ్యారం వీరన్న, హరిలక్ష్మీ, యేరీలక్ష్మీదేవి, దేవదానం, యేసోట్ నరేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రమేష్ ముక్కెర, కెమెరా: కోట తిరుపతిడ్డి, ఛీఫ్ కో-డైక్టర్: మువ్వ.


Click it and Unblock the Notifications











