పెళ్లి చేసుకొంటానని రెండేళ్లుగా రేప్.. డైరెక్టర్ బండారం బయటపెట్టిన టీవీ నటి
బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో కోరిక తీర్చితేనే ఆఫర్లు ఇస్తామంటూ సినీ పరిశ్రమపై మోజు పెంచుకొన్న కొందరు ఔత్సాహిక మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నట్టు చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలాంటి మోసానికి గురైన ఓ టెలివిజన్ నటి ఓ ప్రముఖుడి బండారాన్ని బయటపెట్టింది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన కథనం ప్రకారం..

ఆఫర్ల ఆశ, పెళ్లి చేసుకొంటానని
బాలీవుడ్‌లో క్యాస్టింగ్ డైరెక్టర్ ఆయూష్ తివారీపై ఓ టెలివిజన్ నటి తీవ్రమైన ఆరోపణలు చేసింది. తొలుత నాకు ఆఫర్ల ఆశ చూపించాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకొంటానని నమ్మించాడు. తను మోసగించి పలుమార్లు నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాకు ఇష్టం లేకపోయినా రెండేళ్లుగా నన్ను బలవంతంగా వాడుకొంటూ కోరికలు తీర్చుకొన్నాడు అని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.

పరారీలో క్యాస్టింగ్ డైరెక్టర్
టెలివిజన్ నటి ఫిర్యాదు మేరకు ఆయూష్ తివారీపై కేసు నమోదు చేశాం. ఫిబ్రవరి 26వ తేదీన ఆయనపై వెర్సోవా పోలీసులు కేసు పెట్టి దర్యాప్తు చేస్తనున్నారు. అతడు పరారీలో ఉండటం వలన అరెస్ట్ చేయడానికి వీలు కాలేదు. తదుపరి దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నది అని ఏఎన్ఏ తమ కథనంలో పేర్కొన్నది.

ఇంకా అరెస్ట్ చేయలేదంటూ
టీవీ నటి ఫిర్యాదుపై వెర్సోవా సీనియర్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ రాఘవేంద్ర ఠాకూర్ స్పందించారు. అయూష్ తివారీపై కేసు రిజిస్టర్ చేసింది నిజమే. ముంబైలోని పలు ప్రాంతాల్లో రేప్ చేసినట్టు ఫిర్యాదు చేసింది. దాంతో ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం రేప్ కేసు పెట్టాం. ఇంకా అరెస్ట్ చేయలేదు. కేసును దర్యాప్తు చేస్తున్నాం అని ఠాకూర్ పేర్కొన్నారు.
Recommended Video

16వ తేదీన ఫిర్యాదు చేస్తే.. 26న కేసు నమోదు
ఆయూష్ తివారీ తీరుపై టెలివిజన్ నటి స్పందిస్తూ పోలీసులపై ఆరోపణలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్లుగా అతి సన్నిహితంగా ఉంటున్నాం. మా మధ్య పరిచయం ప్రేమగా మారింది. నన్ను పెళ్లి చేసుకొంటానని మాట ఇచ్చాడు. నన్ను నమ్మించి బలవంతంగా లైంగిక దాడి చేశాడు. నేను నవంబర్ 16వ తేదీన వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. వాళ్లు నవంబర్ 26వ తేదీన కేసు నమోదు చేశారు అని ఆమె తెలిపారు. తన పేరు వివరాలు వెల్లడించడానికి నిరాకరించడం గమనార్హం.


Click it and Unblock the Notifications











