డబ్బులివ్వకపోతే ఫోటోలు లీక్ చేస్తా.. ప్రియుడి నయవంచన.. శ్రావణి మరణం వెనుక షాకింగ్ విషయాలు
టెలివిజన్ నటి శ్రావణి మరణం వెనుక షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె జీవితం అర్దాంతరంగా ముగియడానికి ప్రేమనే కారణమనే కోణం తెలుస్తున్నది. ప్రేమ పేరుతో వంచనకు గురైన శ్రావణి మరణంలో దిగ్బ్రాంతి కరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం శ్రావణి ఆత్మహత్యకు కారణాలు ఇవే అంటూ..

కాకినాడకు చెందిన యువకుడితో ప్రేమ
టెలివిజన్ నటి శ్రావణి గత ఎనిమిదేళ్లుగా తెలుగు సీరియల్స్ నటిస్తున్నారు. మౌనరాగం, మనసు మమత లాంటి సీరియల్స్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. కెరీర్ సానుకూలంగా వెళ్తున్న సమయంలో కాకినాడకు చెందిన ఓ యువకుడితో టిక్‌టాక్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ప్రేమికుడి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆ క్రమంలో మంగళవారం రాత్రి మధురా నగర్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొన్నారు.

ప్రియుడి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు
అయితే తన మరణానికి ముందు ప్రియుడి వేధింపుల విషయంలో శ్రావణి ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా ప్రియుడి నుంచి వేధింపులు అధికం కావడంతో శ్రావణి తీవ్ర మనస్తాపానికి గురైంది. ప్రియుడి ఆగడాలతో మానసిక క్షోభకు గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడుతూ తీవ్రమైన నిర్ణయం తీసుకొన్నారు.

సన్నిహితంగా ఉన్న ఫోటోలను లీక్ చేస్తా
నటి శ్రావణి మరణంతో దిగ్బ్రాంతికి గురైన కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. శ్రావణిని డబ్బుల ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్ చేస్తూ మానసికంగా చంపేశాడు. శ్రావణిని ప్రేమించినట్టు నమ్మించిన ప్రియుడు ఆమెతో సన్నిహితంగా ఉంటూ ఫోటోలు తీసుకొన్నాడు. డబ్బు ఇవ్వకపోతే ఫోటోలు బయటపెడుతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.
Recommended Video

ప్రేమ పేరుతో శ్రావణిని పొట్టన పెట్టుకొని..
బంగారం లాంటి భవిష్యత్ ఉన్న శ్రావణిని ప్రేమ పేరుతో యువకుడు పొట్టనపెట్టుకొన్నాడు. ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించాడు. ఆ బాధను తట్టుకోలేకే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రావణి మరణానికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











