పూర్తి జంతువుల అరుపులతో తెలుగు పాట...
ప్రపంచ సినీ చరిత్రలోనే మొదటి సారిగా జంతువుల అరుపులతో ఓ పాటను చేశాం. అలాగే 'తెలియదు' అనే పదాన్ని 24 విధాలుగా తిరగేసి రాస్తే వచ్చే పదాలతో మరో పాటను టైటిల్ సాంగ్ గా మలిచాం అని దర్శకుడు డాక్టర్ రాజిరెడ్డి గుర్రం అన్నారు. 'తెలియదు' అనే చిత్రంతో పరిచయమవుతున్న రాజిరెడ్డి గుర్రం తన సినిమా విశేషాల గురించి పై విధంగా మీడియాకి తెలియచేసారు...ఆయన మాటల్లోనే...'సృష్టికి మొదలు, అంతం తెలియదు. ఏ విషయాన్ని అయినా క్షుణంగా తెలుసుకుంటూ పోతే చివరకు మిగిలేది తెలియదు మాత్రమే. అంటే ప్రపంచమంతా తెలియదు మయం. కాబట్టే ఈ సినిమాకు ఆ పేరు పెట్టాం. అంతేకాకుండా సినిమాలో మరో కొత్త అంశాన్ని చూపించాం. అది ఏంటో సినిమా చూస్తే కానీ తెలియదు. హ్యాకర్స్ వల్ల ప్రజలు ఎదుర్కొనే సమస్యలను కథాంశంగా చేసుకుని ఈ చిత్రాన్నిరూపొందించాం అన్నారు. ఈ చిత్రంలో అలేఖ్యారావ్ హీరోయిన్ గాను, వాసిఫ్, సంతోష్ పార్లవార్, హండ్రెడ్, శరత్, నాగతేజ్ ముఖ్యపాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











