twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘తెలుగబ్బాయి’ రిలీజ్ డేట్ ఖరారు

    By Bojja Kumar
    |

    తనీష్, రమ్య నంబీశన్, తషు కౌశిక్ హీరో హీరోయిన్లుగా ఓఎస్ అవినాష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తెలుగబ్బాయి. వెరా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై నిర్మాత ఎస్. రామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తిగా మలేషియాలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈచిత్రం మార్చి 1న విడుదలకు సిద్ధం అవుతోంది.

    ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ...'యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెలుగబ్బాయి చిత్రాన్ని రూపొందించాను. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈచిత్రంలో ఉంటాయి. తనీష్ లుక్, తషు కౌశిక్ గ్లామర్, యాక్షన్ ఎపిసోడ్స్ ఈచిత్రానికి హైలెట్స్' అన్నారు.

    హీరో తనీష్ మాట్లాడుతూ 'మేం వయసుకు వచ్చాం' చిత్రం సక్సెస్ తర్వాత రిలీజ్ అవుతున్న మూవీ ఇది. తెలుగబ్బాయి నటుడిగా నాకు మరింత మంచి పేరు, గుర్తింపు తీసుకొస్తుంది. నా కెరీర్లో తెలుగబ్బాయి వన్ ఆఫ్ ది కాస్టిలియస్ట్ అండ్ స్టైలిష్ మూవీ అవుతుంది' అన్నారు.

    తనీష్, రమ్య నంబీశన్, తషు కౌశిక్, నాగబాబు, లోహిత్, సోనా నాయర్, అనన్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా ప్రతాప్.వి.కుమార్, ఎడిటింగ్ ఓ. రవిశంకర్, పాటలు జె.ఎస్. నివాస్, సంగీతం : మెజో జోసఫ్, రీ-రికార్డింగ్ : ఎస్వీ ఈశ్వర్, సమర్పణ : ఎస్. కళై వాణి, నిర్మాత : ఎస్. రామకృష్ణ, రచన, దర్శకత్వం, ఓ.ఎస్. అవినాష్.

    English summary
    
 Tollywood actor Tanish new movie 'Telugu Abbai' releasing on March 1st. Ramya Nambeesan and Tashu Kaushik are lead heroines. Avinash direct this movie and Ramakrishna is the producer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X