రజనీకాంత్ సినిమాలో కూడా బ్రహ్మీ కామెడీ!
హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నవ్వుల డాన్ బ్రహ్మానందం లేకుండా సినిమాలు తీసే సాహసం కనిపించడం లేదు. ఏవో కొన్ని సినిమాలు తప్పితే ప్రతి సినిమాలోనూ బ్రహ్మానందం తప్పని సరి కనిపిస్తున్నాడు. ఇక స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు బ్రహ్మీ లేకుండా హిట్టు కొట్టలేమని ఫిక్స్ అయిపోతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బ్రహ్మానందం కామెడీ రేంజ్ ఏమిటో.
త్వరలో రాబోతున్న రజనీకాంత్ సినిమా ‘లింగా'లో కూడా బ్రహ్మానందం సందడి చేయబోతున్నారు. ఆయనకు సంబంధించి షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కించారు. ఇందులో బ్రహ్మానందం ఖాకీ డ్రస్సులో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. దర్శకుడు కె.ఎస్.రవికుమార్ బ్రహ్మానందం పాత్రను నవ్వులు పూయించేలా డిజైన్ చేసారట. చాన్నాళ్ల తర్వాత బాల సుబ్రహ్మణ్యం రజనీకాంత్ నటించిన సినిమాకు టైటిల్ సాంగ్ పాడారు.

‘లింగా' చిత్రంలో రజనికి జోడిగా అందాల భామలు అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కెఎస్. రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాతగా రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సౌత్ ఇండియాలో అత్యంత భారీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ, ఏ.అర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ...''మా బ్యానర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం లింగా. సూపర్ స్టార్ రజనికాంత్ గారితో మేము చిత్రం చేయటం చాలా హ్యాపీగా ఉంది, అయన సరసన అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. రెహమాన్ సంగీతం, రత్నవేలు కెమెరా ఇలా భారత దేశంలో ఉన్నతమైన సంకేతిన నిపుణులతో ఈ చిత్రం చేస్తున్నాము. కెఎస్.రవి కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము, రవికుమార్, రజనికాంత్‌గారి కాంబినేషన్‌లో వచ్చిన ముత్తు, అరుణాచలం ఎంత పెద్ద విజయాలు సాధించాయో అందరికి తెలిసిందే ఈ సినిమా ఆ రెండు చిత్రాలని మించి ఉంటుంది. రెహమాన్ గారు అందించిన సంగీతం దీపావళి కి విడుదల చేసి, సినిమా ని సూపర్ స్టార్ రజని కాంత్ గారి పుట్టిన రోజు(డిసెంబర్ 12)న విడుదల చేస్తాము" అని అన్నారు.


Click it and Unblock the Notifications











