డ్రగ్స్ కేసులో అరెస్టయిన మరో తెలుగు నటుడు
హైదరాబాద్: టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ వాడకం వెలుగులోకి వచ్చింది. గతంలో హీరో రవితేజ సోదరులతో పాటు పలువురు ఈ కేసులో అరెస్టయిన సంఘటన మరువక ముందే తాజాగా... మరో తెలుగు నటుడు అభిషేక్ డ్రగ్స్ వాడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు.
పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులకు అభిషేక్‌ను హైదరాబాద్ ఎస్ఆర్‌నగర్ వద్ద పట్టుకున్నారు. అతని నుంచి పది గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అభిషేక్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాడు. అతన్ని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి డీజీపీ కార్యాలయానికి తరలించారు.
అభిషేక్ 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంలో..... త్రిషను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించే విలన్ పాత్రలో అభిషేక్ నటించాడు. ఈ చిత్రంతో పాటు పలు తెలుగు చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసాడు. డ్రగ్స్‌కు బానిసైనందు వల్లనే ఈ మధ్య అతను సినిమాల్లో కనిపించడం లేదని స్పష్టం అవుతోంది.
రవితేజ సోదరులు డ్రగ్స్ కేసులో పట్టుబడి అరెస్టయినప్పటి నుంచి పోలీసులు టాలీవుడ్ లో డ్రగ్స్ వాడకంపై సీరియస్‌గా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు డ్రగ్స్ వాడుతున్న నటులను, నిర్మాతలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల దాడితో ఈ మధ్య టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం తగ్గుముఖం పట్టిందనుకునే సమయంలో మరో నటుడు అరెస్టు కావడంతో... టాలీవుడ్లో డ్రగ్స్ వాడకం జోరు తగ్గలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











