‘మహర్షి’ విజయోత్సవం నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం... నటుడు హేమంత్ కారు బోల్తా!
తెలుగు యాంకర్, నటుడు హేమంత్ కారు ప్రమాదానికి గురైంది. విజయవాడలో శనివారం రాత్రి 'మహర్షి' విజయోత్సవంలో పాల్గొని తిరిగి వస్తుండగా స్థానిక జగ్గయ్యపేట మండలంలోని షేర్ మహ్మద్ పేట క్రాస్ రోడ్డు వద్ద కారు గేదెను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. కారు డ్రైవ్ చేస్తున్న హేమంత్ ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయట పడ్డారు.
హేమంత్ 'మహర్షి' సినిమాలో వచ్చే కాలేజీ ఎపిసోడ్లో మహేష్ ఫ్రెండు పాత్రలో నటించారు. శనివారం సాయంత్రం జరిగిన 'మహర్షి' విజయోత్సవానికి యాంకరింగ్ చేశాడు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి హైదరాబాద్ వస్తుండగా అర్థరాత్రి ఈ ప్రమాదం సంభవించింది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మరణించిన గెదేతో పాటు, కారును పక్కకు తొలగించి రోడ్డు క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై పవర్‌ఫుల్ సోషల్ మెసేజ్‌తో రూపొందిన భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం.
మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం టెర్రిఫిక్ కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా శనివారం విజయవాడలో 'మహర్షి విజయోత్సవం' పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో మహేష్ బాబుతో పాటు చిత్ర బృందం మొత్తం పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











