తొలి నుంచి తోడుగా ఉన్న అభిమాని మరణం.. మనస్థాపంలో జూ ఎన్టీఆర్!

Recommended Video

Jr NTR Gets Emotional About His Fan || Filmibeat Telugu

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తన అభిమానులను ఎలా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి సినిమా వేడుకలోనూ ఫ్యాన్స్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడతారు. తన సినిమా వేడుక నుంచి ఇంటికి వెళ్లేపుడు జాగ్రత్తగా వెళ్లాలని జాగ్రత్తలు చెబుతారు. అభిమానులకు ఏమైనా అయితే తట్టుకోలేని మనస్తత్వం ఆయనది. అలాంటి వ్యక్తి తన తొలి అడుగు నుంచి వెన్నంటి ఉన్న అభిమానికి ఏమైనా అయితే ఎంత బాధ పడతారో మాటల్లో చెప్పడం కష్టమే. ప్రస్తుతం యంగ్ టైగర్ అలాంటి బాధలోనే ఉన్నారు. ముందు నుంచి తనకు తోడుగా ఉన్న అభిమాని ఇక లేరు అనే విషయాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. బాధను వ్యక్తం చేస్తూ ఓ లేఖను విడుదల చేశారు.

మా ప్రయాణం అర్దాంతరంగా ముగుస్తుందనుకోలేదు

మా ప్రయాణం అర్దాంతరంగా ముగుస్తుందనుకోలేదు

"నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణ జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరు అన్న వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. "నిన్ను చూడాలని" చిత్రం‌తో మొదలయిన మా ప్రయాణం ఇలా అర్ధాంతరం‌గా ముగిసిపోతుంది అని ఊహించలేదు." అని యంగ్ టైగర్ వ్యాఖ్యానించారు.

నేను వేసిన తొలి అడుగు నుండి నేటి వరకు

నేను వేసిన తొలి అడుగు నుండి నేటి వరకు

"నటుడి గా నేను చుసిన ఎత్తుపల్లాలలో నాకు వెన్నంటే ఉన్నది నా అభిమానులు. ఆ అభిమానులలో, నేను వేసిన తొలి అడుగు నుండి నేటి వరకు నాకు తోడు‌గా ఉన్న వారి లో జయదేవ్ చాలా ముఖ్యమైన వారు." అంటూ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ లేఖ చూసిన అభిమానులు సైతం ఎమోషనల్ అయిపోతున్నారు.

‘జయదేవ్ లేని లోటు నాకు తీరనిది: ఫోటో షేర్ చేసిన యంగ్ టైగర్

‘జయదేవ్ లేని లోటు నాకు తీరనిది: ఫోటో షేర్ చేసిన యంగ్ టైగర్

‘‘జయదేవ్ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి నా ప్రఘాఢమైన సానుభూతి తెలుపుతున్నాను.'' అంటూ యంగ్ టైగర్ తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీ ద్వారా ఫోటో షేర్ చేశారు. ఈ పోస్ట్ చూసి నందమూరి అభిమానులు వేలాదిగా రియాక్ట్ అవుతూ సంతపం వ్యక్తం చేస్తున్నారు.

అంత్యక్రియలకు భారీగా తరలి వచ్చిన అభిమానులు

జయదేవ్... కృష్ణ జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి కావడంతో జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా అభిమాన సంఘాల నాయకులు, ఫ్యాన్స్ తరలి వస్తున్నారు. యంగ్ టైగర్ వెళ్లి జయదేవ్ కుటుంబ సభ్యులను పరామర్శించే అవకాశం ఉందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X